Site icon NTV Telugu

Mahesh Kumar Goud : తెలంగాణ రాక ముందు, ఇప్పుడు మీ ఆస్తులు ఎంతా?.. చర్చకు వస్తారా

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

నిన్న ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు అంత ద్రోహులు అని అనడం చరిత్రను వక్రీకరించడమే అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. తాజాగా ఆయన ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చింది అని అసెంబ్లీలో కేసిఆర్ చెప్పారని, రాజకీయ భోగాలు అనుభవిస్తున్నది మీరు.. తెలంగాణ కాంగ్రెస్ నష్టపోతుంది అని తెలిసి కూడా ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. కవిత పుట్టకముందే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారని, బతుకమ్మ, వంటావార్పు చేస్తే తెలంగాణ వచ్చింది అని అనుకుంటున్నారన్నారు. తెలంగాణ వస్తే ఎవరు బాగుపడ్డరు రాష్ట్రంలో… కవిత పుట్టక ముందే ఇందిరా గాంధీ బతుకమ్మ ఎత్తుకున్నారన్నారు. తెలంగాణ రాక ముందు, ఇప్పుడు మీ ఆస్తులు ఎంతా?.చర్చకు వస్తారా అని ఆయన సవాల్‌ విసిరారు.

Also Read :Nara Brahmani : వావ్‌.. నారా బ్రహ్మణిలో మరో టాలెంట్‌.. లడక్‌లో బైక్‌ రైడింగ్‌ వీడియో..

అసైన్డ్ భూములు కూడా వదలడం లేదని, హైదరాబాద్ చుట్టూ ఉన్న 80 శాతం భూములు మీ చేతుల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాల పరిస్థితి ఏంటి అని ఒక్కసారి అయినా ఆలోచించారా అని మహేశ్‌కుమార్‌ మండిపడ్డారు. ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న 80 శాతం మంది ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్విన వల్లేనని, మీరు చేసిన ఘనకార్యం రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు.

తెలంగాణ వచ్చిన ప్రజల బతుకులు మారలేదని, మీ కుటుంబ సభ్యుల బతుకులు బంగారం అయ్యాయన్నారు. ధరణి వల్ల ఎమ్మార్వో మీద పెట్రోల్ పోసి చంపే పరిస్తితి వచ్చిందన్నారు. పోడు భూముల సమస్యల వల్ల శ్రీనివాస్ అనే ఎఫ్‌ఆర్‌వో అధికారి చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కవిత తెలంగాణ కాంగ్రెస్ గురించి మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారన్నారు.

Exit mobile version