TPCC Mahesh Goud : డీసీసీ కమిటీలను ప్రకటించిన టీపీసీసీ చీఫ్
- డీసీసీ కమిటీలకు గ్రీన్ సిగ్నల్
- 14 జిల్లాలకు పూర్తి స్థాయి కార్యవర్గం
- స్థానిక నేతలతో చర్చల తర్వాత నిర్ణయం
- కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Goud : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీల (DCC) నియామక ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తొలి విడతగా రాష్ట్రంలోని 14 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయి కార్యవర్గ కమిటీలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటించారు.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
గత పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే ఈ కమిటీల నియామకంపై పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. నియామకాల్లో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా ఉండేందుకు మహేష్ కుమార్ గౌడ్ నిన్న రాత్రి వరకు తీవ్రంగా కసరత్తు చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో సుదీర్ఘంగా చర్చించి, వారిని సమన్వయపరుస్తూ ఈ జాబితాను ఖరారు చేశారు. గతంలో వేసిన స్క్రీనింగ్ కమిటీ సూచనలను పాటిస్తూనే, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ కమిటీల్లో పెద్దపీట వేశారు.
Dhurandhar2 : గుడ్ న్యూస్.. ‘ధురంధర్ 2’ డబ్బింగ్ & సెన్సార్ పూర్తి.. షోస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే
ఈ ప్రకటనలో కేవలం అధ్యక్షులను మాత్రమే కాకుండా, జిల్లా స్థాయిలో పార్టీని నడిపించే పూర్తి స్థాయి యంత్రాంగాన్ని నియమించారు. ప్రతి జిల్లా కమిటీలో వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్లను నియమించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కమిటీలను ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం భావిస్తోంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు కార్యచరణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణంపై ఎక్కువ ఫోకస్ చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమిటీలు పనిచేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం. మొదటి విడతలో 14 జిల్లాలను ప్రకటించగా, మిగిలిన జిల్లాల కమిటీలను కూడా త్వరలోనే వెల్లడించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియామకాలతో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త జోష్ నెలకొంది.
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!