NTV Telugu Site icon

Revanth Reddy: అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క.. బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ

Revanth Reddy

Revanth Reddy

అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీ అని టీపీసీసీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌, బీజేపీ ఇద్దరూ కలిసే ఉన్నారని విమర్శించారు. వాళ్ళు వేరు వేరు అని ఎప్పుడూ అనుకోవద్దని, ఏ విషయంలో సరే వాళ్ళు విడిపోయారు చెప్పండని ప్రశ్నించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడు కెసిఆర్ అని చెప్పింది బీజేపీ నే అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అప్పులు తెచ్చుకో అని 4 వేల కోట్లు అప్పులకు అనుమతి ఇచ్చింది బీజేపీ కాాదా అంటూ నిప్పులు చెరిగారు.

గర్నర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ..

ప్రజలు ఆక్టివ్ గవర్నమెంట్ కోరుకుంటున్నారని , అది తెలంగాణలో లేదని విమర్శించారు. ప్రభుత్వం సచ్చిపోయిందని నిప్పులు చెరిగారు. మైనర్ బాలిక మీద దాడులు జరుగుతుంటే సర్కార్ నుండి స్పందనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ చేతిలో సెక్షన్ 8 ఉంది, అవసరం అనుకుంటే ప్రభుత్వాన్ని తీసి పక్కన పడేయ వచ్చు అని గుర్తు చేశారు. గవర్నర్ సెక్షన్ 8 ప్రకారంఅవసరం అనుకుంటే ప్రభుత్వానికి ఆదేశాలు చేయవచ్చు, గ్రేటర్ పరిధిలో ప్రభుత్వాన్ను తన పరిధిలోకి తీసుకోవచ్చని సెక్ష‌న్ తో స‌హా గ‌వ‌ర్న‌ర్ గురించి చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.

ఇక సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. శాంతి భద్రతలు సీఎం పరిధిలో వుంటాయ‌న్నారు. వరుస సంఘటనలు జరుగుతుంటే సీఎం.. డీజీపీ..సీపీ..హోమ్ మంత్రి తో కనీసం సమీక్ష చేయడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రేవంత్‌. కెసిఆర్ సొంత రాజ్యాంగం రాసుకుంటా అంటే అయన ఇష్టం మ‌ని ఎద్దేవ చేశారు. అధికారం మాత్రమే ఉంటది.. బాధ్యతలు ఉండవు అనుకుంటున్నారు సీఎం అని విమ‌ర్శించారు. బాధ్యతలు లేవని సీఎం అనుకున్నప్పుడు కొన్ని చర్యలు ఉంటాయని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.

NV Ramana : ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే

Show comments