NTV Telugu Site icon

Revanth Reddy: జయశంకర్ సొంతూరులో రచ్చబండ.. కేసీఆర్‌ను దంచుడే, దించుడే..!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సొంతూరు అక్కంపేట నిరాధారణకు గురైందన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సొంతూరు అక్కంపేటలో రైతు రచ్చబండ నిర్వహించిన రేవంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందన్నారు.. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ప్రగతిభవన్ గడి గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు.. జయశంకర్‌ సార్‌ సొంతూరు అక్కంపేటలో కనీసం ఆయన విగ్రహం పెట్టలేదని మండిపడ్డ ఆయన.. చివరకు కొండా దంపతులే జయశంకర్‌ విగ్రహం పెట్టారని గుర్తుచేశారు..

Read Also: Attack: చెరువు కబ్జా..! బీజేపీ నేతలపై గోపన్‌పల్లి వాసుల దాడి

ఇక, అక్కంపేటను తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని అక్కంపేటకు తీసుకొస్తానన్న ఆయన.. జయశంకర్ స్ఫూర్తితో రైతు రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాను.. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ గంగల కలుపుతా.. కేసీఆర్‌ను బొందలో పెడతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్‌ను చెప్పులతో కొట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కేసీఆర్ దంచుడే… కేసీఆర్‌ను అధికారంలో నుంచి దించుడేనంటూ హెచ్చరించారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

మరోవైపు, కడియం శ్రీహరి, మధుసూదనాచారిలను కేసీఆర్‌ ఇళ్లలో కూర్చోబెట్టారని విమర్శించారు రేవంత్‌రెడ్డి.. అభివృద్ధి నమూనా ఎక్కడ ఉండాలి అంటే దళిత కాలనీల్లో ఉండాలి.. కానీ, ఎలా ఉంది అని చుస్తే దళిత కాలనీల్లో అభివృద్ధి ఆమడ దూరంలో ఉందన్నారు.. దళిత ఆడబిడ్డల జోలికి వస్తే చెప్పుతో పెట్టి కొట్టండి అని పిలుపునిచ్చారు. అక్కంపేట గ్రామస్థులపైనా కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. గిట్టుబాటు ధర ఇస్తాం, 2 లక్షలరుణ మాఫీ చేస్తాం అని ప్రటించారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌తో రైతులకు లాభం చేకూరుతుందన్నారు.