Site icon NTV Telugu

Anvesh Reddy: ధరణి భూ సమస్యలు సృష్టిస్తోంది..

Anevsh Reddy Congress

Anevsh Reddy Congress

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ధరణి. అయితే ఈ ధరణితో భూ సమస్యలు మరిన్ని పెరుతున్నాయని అన్నారు టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూమి హక్కు పత్రాల కోసం 5 సంవత్సరాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ధరణి భూ సమస్యలు పెంచుతుంది తప్ప..నిజమైన హక్కు దారుడికి పట్టపుస్తకాలు రావడం లేదని మండిపడ్డారు. అంతేకాకుండా.. ధరణి కారణంగా ఎమ్మార్వో లని కూడా తగులబెట్టిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల ఎకరాలకు పుస్తకాలు అందలేదని, నిజమైన హక్కుదారులను కూడా నిషేధిత జాబితాలో పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.

రైతుల దగ్గర భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ భూ రికార్డులు హక్కులకు సంబంధించిన రైతులకు మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జులై 6 వ తేదీ ఉదయం 10 – 5 వరకు ఇందిరా పార్కు దగ్గర ధరణి రచ్చబండ నిర్వహిస్తున్నామని, భూ పట్టాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే వారంతా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇబ్బందులు పడే రైతాంగానికి అండగా ఉంటామని, నిజమైన హక్కుదారుకు పట్టాలు ఇవ్వండని ఆయన డిమాండ్‌ చేశారు. బాధితుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

Anurag Tagore : తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

Exit mobile version