నేడు దామరచర్లలో పర్యటన
నేడు నల్గొండ జిల్లా దామరచర్లలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మితమవుతున్న యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ నుంచి బయల్దేరనున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు. రూ.29,965 కోట్లతో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా 5 యూనిట్లను నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్ వాసులు అలర్ట్.. నేటి నుంచే స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి ట్రాపిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి. గీత దాటితే దాట తీస్తామంటున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. నగరంలో రాంగ్సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వారం రోజులుగా ఈ ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్పై రూ.1700, ట్రిపుల్ రైడింగ్పై రూ. 1200 ఫైన్ వేయనున్నారు. ఈ రెండు ఉల్లంఘనల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన అధ్యయనంలో తేలింది.
ధరణీ సమస్యలపై నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం
ఇవాళ జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ సీతాకాల సమావేశం జరుగనుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ లో ప్రధానంగా ధరణీలో సమస్యల పరిస్కారమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎస్. దీంతో కలెక్టర్లు ఇప్పటికే గ్రామాల వారిగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో బీజేపీ పిటిషన్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాదయాత్ర మొదలవుతుందా..? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. లా అండ్ ఆర్డర్ కారణాల వల్ల చివరి నిమిషంలో పోలీసులు మార్చ్‌కు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలుచేసింది. బండి సంజయ్ పాదయాత్ర అనుమతి నిరాకరణపై హౌస్‌మోషన్ పిటిషన్. నిర్మల్ పోలీసులు కావాలనే రద్దు చేశారని హైకోర్టులో పిటిషన్. వారం క్రితం అనుమతి ఇచ్చి ఇవాళ కావాలనే రద్దు చేసినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.
నేడు ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు.. మరి మల్లారెడ్డి?
ఇవాళ ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. మల్లారెడ్డితో పాటు 16 మంది నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే నేడు ఐటీ ముందు హాజరుకానున్న 14 మంది హాజరు కానున్నారు. మరి 16 మందిలో ఇద్దరు హాజరవుతారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తు తున్నాయి. ఇవాల ఐటీ ముందుకు మంత్రి రెడ్డితో పాటు మరొకరు కూడా హాజరుపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం వరకు 48 గంటలపాటు మల్లారెడ్డి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు ఐటీ నిర్వహించింది. రూ.100 కోట్ల డొనేషన్లు వసూలు చేశారని ఆరోపణలతో ఐటీ సోదాలు నిర్వహించింది. మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఇల్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహించింది.
Read also: MallaReddy IT Raids: నేడు ఐటీ ముందుకు మల్లారెడ్డి కుటుంబం.. మల్లారెడ్డి హాజరుపై ఉత్కంఠ
పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టం
చివరి ఘట్టానికి చేరుకున్న పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. ఇవాళ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం. తిరుమల శ్రీవారి నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ సారె. ఉదయం 11.40 గంటలకు అమ్మవారికి చక్రస్నానం. భక్తులతో కిక్కిరిసిపోయిన తిరుపతి రోడ్లు.
నేడు తూర్పుగోదావరి జిల్లాలో హోంశాఖ తానేటి వనిత పర్యటన
తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోంశాఖ తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కొవ్వూరు క్యాంప్ ఆఫీస్ లో మహాత్మ జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. ఉదయం 10:30 కి రాజమండ్రి కలెక్టరేట్ లో జరిగే సీఎం గారి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరవుతారు. అనంతరం సున్నా వడ్డీ పంట రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
జేఏసీ నేతలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
కోనసీమ జిల్లాలో తమపై నమోదు చేసిన కేసులు కొట్టెయ్యాలంటూ అమరావతి జేఏసీ నేతలు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేయనుంది.
read also: Chiru Balayya: ఈ ఇద్దరూ కలవడానికి ఇదే మంచి ఛాన్స్
పంజాబ్‌లో విషాదం.. పండ్లు తింటుండగా చిన్నారులపై దూసుకెళ్లిన ట్రైన్
పంజాబ్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై సరదాగా ఆడుకుంటూ, పండ్లు తింటుండగా.. వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం కిరత్‌పుట్ సాహిబ్‌లో సుల్తేజ్ నదిపై నిర్మించిన లోహంద్ రైల్వే బ్రిడ్ వద్ద ఈ ఘటన జరిగింది. నలుగురు పిల్లలు చెట్ల నుంచి పండ్లు కోసుకొని, రైలు పట్టాలపై కూర్చొని తింటున్నారని, అదే సమయంలో రైలు రావడంతో వాళ్లు మృతి చెందారని అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ జగ్‌జీత్ సింగ్ అన్నారు.
ఢిల్లీ, పంజాబ్ మాదిరి.. గుజరాత్‌లోనూ అంచనాలు రిపీట్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలవడం ఖాయమని.. ఢిల్లీ, పంజాబ్ మాదిరిగానే గుజరాత్ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తమ పార్టీ గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. జనవరి 31 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
