గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్
తమిళనాడులోని కరూర్ లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే 40 మంది దాకా చనిపోయారు. ఇంకా పదులకొద్దీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటనపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమిళనాడు అగ్ర హీరోలు అయిన రజినీకాంత్, కమల్ హాసన్ కూడా స్పందించారు. ఈ ఘటనపై కమల్ స్పందిస్తూ.. కరూర్ తొక్కిసలాట గురించి విని నా గుండె వణికిపోయింది. ఆ వార్తలు వింటుంటే దుఃఖం ఆగట్లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడ్డ వారు త్వరలో కోలుకోవాలని కోరుతున్నా అని తెలిపారు.
దక్షిణ కొరియాకు అగ్రరాజ్యం ఆఫర్.. దేశం నాశనం అవుతుందని భయపడుతున్న కొరియన్స్!
నిత్యం సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలవడం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటు అయ్యింది. ఇటీవల ఆయన ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అగ్రరాజ్యం ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే.. దక్షిణ కొరియాకు అందరికీ వింతగా అనిపించే ఒప్పందాన్ని ఆఫర్ చేసింది కాబట్టి. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దేశంపై ఏకపక్ష సుంకాలను విధించారు. తాజాగా ఆయన ఆ సుంకాలను తగ్గించడానికి దక్షిణ కొరియాకు వింతగా అనిపించే ఒప్పందాన్ని ప్రతిపాదించారు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉపఎన్నికలే కాంగ్రెస్‌కు గుణపాఠం
భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట ప్రాంతంలో పర్యటించిన ఆయన, ప్రజలతో కలసి ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా “కాంగ్రెస్ బకాయి కార్డు” అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. కేటీఆర్ తన బృందంతో కలిసి ఇంటింటికీ వెళ్లి బకాయి కార్డులను అందజేశారు. వాటిలో ప్రతి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో, ఏ ఏ వాగ్దానాలు నెరవేర్చలేదో స్పష్టంగా వివరించారు. ఈ కార్డుల ద్వారా కాంగ్రెస్ చేసిన మోసాలను, అసత్య వాగ్దానాలను ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అన్నీ మోసమే. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారు. బకాయి కార్డుల ద్వారా మేము ఈ మోసాన్ని బయటపెడతాం” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, వాగ్దానభంగానికి గుణపాఠం చెప్పే అవకాశం ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికలు రూపంలో వచ్చాయని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక ఓటమి చవి చూడాల్సిందేనని హెచ్చరించారు.
‘‘ఘజ్వా-ఏ-హింద్ భారత్‌లో జరగదు’’.. నరకానికి వెళ్లాలంటే ఆ కలలు కనండి..
ఉత్తర్ ప్రదేశ్‌లో ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం పెద్ద ఎత్తున అల్లర్లకు కారణమైంది. రెండు రోజుల క్రితం శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం మూక రాళ్ల దాడికి పాల్పడింది. ఈ సంఘటన తర్వాత యూపీ పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వివాదానికి కారణమైన మౌలానా తౌకీర్ రజా ఖాన్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ అల్లర్లపై యూపీ సీఎం యోగి మాట్లాడుతూ..‘‘తాను అధికారంలో ఉన్న విషయాన్ని మౌలానా మరిచిపోయినట్లు ఉన్నారు’’ అని వార్నింగ్ ఇచ్చారు.
రౌడీషీటర్లు వీసీ సజ్జనార్ వార్నింగ్.. అలా చేస్తే పీడీ యాక్ట్‌లే
కొత్తగా నియమితులైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ తన ప్రాధాన్యతలు, విధానాలను స్పష్టంగా వెల్లడించారు. ఎన్ టివి తో మాట్లాడిన ఆయన, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సజ్జనార్ మాట్లాడుతూ.. “నేను ఎప్పటిలాగే నా పంథాలోనే ముందుకు వెళ్తాను. నగరంలో చట్టసువ్యవస్థ పరిరక్షణ కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తాను. ముఖ్యంగా సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తాం,” అని తెలిపారు. అదే సమయంలో రౌడీషీటర్లపై గట్టి చర్యలు తప్పవని హెచ్చరించారు. “హైదరాబాద్ లో ఎవరైనా రౌడీషీటర్లు హల్చల్ చేస్తే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. చట్టం అందరికీ సమానమే,” అని ఆయన చెప్పారు. సోషల్ మీడియా విషయంలో కూడా కొత్త కమిషనర్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. “సోషల్ మీడియాలో అనర్ధాలకు దారితీసే పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా రాజకీయ నాయకులు, వారి అనుచరులు కూడా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడకూడదు. ఎక్కడో జరిగిన సంఘటనను వక్రీకరించి పోస్టులు పెడితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది,” అని ఆయన హెచ్చరించారు.
నాభర్తకు పాకిస్తాన్‌తో సంబంధం లేదు.. సోనమ్ వాంగ్‌చుక్ భార్య..
రాష్ట్ర హోదా కోసం ఇటీవల కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ అట్టుడికింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది, వాహనాలపై దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో మంది గాయాలపాలయ్యారు. అయితే, ఈ అల్లర్లను ప్రేరేపించారనే అభియోగంపై లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడికి పాకిస్తాన్ గూఢచారితో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే, ఆయనకు సంబంధించిన ఎన్జీవోల్లో విదేశీ నిధుల అక్రమాలు జరిగాయని కేంద్రం విచారణ ప్రారంభించింది.
ఇలాంటి సినిమా చేయడం అసాధ్యం, రిషబ్ వల్లే సాధ్యమైంది!
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా కాంతార: చాప్టర్ వన్ రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “ప్రతిసారి మాట్లాడినట్లు ఈసారి అరిచి మాట్లాడలేను, ఎందుకంటే కొంచెం నొప్పిగా ఉంది. మీరు సరే అంటే, మామూలుగానే మాట్లాడుతాను,” అంటూ మొదలుపెట్టి , “మూడు, నాలుగు ఏళ్ల వయసున్నప్పుడే మా అమ్మమ్మ, ఇది కుందాపుర దగ్గరలో మా ఊరు,” అంటూ అప్పటి నుంచే నాకు ఆ ఊరు గురించి, సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పడం మొదలు పెట్టింది.
మణిరత్నం..బోయపాటి బెస్ట్ క్వాలిటీస్ ఇచ్చి కొడుకుని కంటే వాడే సుజిత్!
అందాల రాక్షసి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్, తర్వాతి కాలంలో దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయడం లేదు, కానీ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో మెరుస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. అయితే, తాజాగా ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
బతుకమ్మకుంటను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని బతుకమ్మకుంటను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి బతుకమ్మను వదిలి, గంగమ్మకు చీర, సారెను సమర్పిస్తూ పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. బతుకమ్మకుంటకు రూ.7.40 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేసిన హైడ్రా సంస్థకు సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు, “బతుకమ్మకుంట అభివృద్ధికి హనుమంతరావు ఒక జీవితసాధనగా పోరాటం చేశాడు. ఆయన ప్రయత్నాలు గుర్తుంచుకోవాల్సినవి. అందువల్ల బతుకమ్మకుంటకు ఆయన పేరును ఉంచడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహిస్తున్నారు.”
