Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త జీఎస్టీ రేట్లు రేపు, సెప్టెంబర్ 22న అమలులోకి వస్తాయి. దానికి ముందు.. మోడీ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు అని, ఆ రోజున నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం వేడుకలకు సమయం మాత్రమే కాదని, ఆర్థికాభివృద్ధికి, పన్ను సంస్కరణలకు కీలకమైన దశ అని ప్రధాని అన్నారు. రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయని.. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ఎంతో ఆదాయం మిగులుతోందని తెలిపారు. పండగల సమయంలో దేశంలోని అందరికీ మేలు జరుగుతుందని.. జీఎస్టీ సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో దేశంలోని ప్రతి పౌరుడి డబ్బు ఆదా అవుతుందన్నారు. ఇది సామాన్యులకు తీపికబురు అన్నారు.

చుక్క ముట్టకుండానే కిక్ ఇచ్చే సామ్రాజ్యాన్ని సృష్టించాడు.. మీకు విఠల్ మాల్యా తెలుసా!

పండుగ ఏదైనా పబ్బం ఏమైనా మద్యం ప్రియులు అక్కడ ఉన్నారంటే వారి నాలుక ఒకదాని కోసం తహతహలాడుతుంది.. ఇంతకీ అది ఏంటని ఆలోచిస్తున్నారా? అదే మద్యం. ఈ మద్యంలో కూడా ఓ ఫేమస్ బ్రాండ్ ఎక్కువ మంది స్పెషల్ ఛాయిస్‌గా ఉంది. అందేంటి అనుకుంటున్నారా.. కింగ్ ఫిషర్. మీకు తెలుసా ఈ కంపెనీ స్థాపకులు ఎవరో.. విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా అనుకుంటే పొరపాటు చేసినట్లే.. ఆయన కాదు గురు.. ఆయన తండ్రి విఠల్ మాల్యా. భారత దేశ మద్యం వ్యాపారంలో మకుటం లేని మహారాజు.. చుక్క ముట్టకుండానే కిక్ ఇచ్చే సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆయన.. తన జీవిత కాలంలో దివాళ అంచున ఉన్న ఎన్నో సంస్థలను విజయతీరాల వైపు పరుగులు పెట్టించిన సక్సెస్‌పుల్ వ్యాపారవేత్త. ఆయన ప్రస్థానాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.. అవకాశాల కోసం తపనతో, విద్యార్థిగా ఉన్నప్పుడే విట్టల్ మాల్యా తన వ్యాపార ప్రయత్నాలను ప్రారంభించాడు. ఓ సాధారణ ఆర్మీ డాక్టర్‌కు జన్మించిన ఆయన డూన్ స్కూల్‌లో తన చివరి సంవత్సరంలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించారని చెబుతారు. పాఠశాల తర్వాత ఆయన తన తండ్రి పోస్టింగ్‌ల కారణంగా కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. కలకత్తాలో తన కళాశాల రోజుల్లో మాల్యా స్టాక్ మార్కెట్‌లో మునిగిపోయారు. ఇదే ఆయన తన భవిష్యత్తులో చేసిన సాహసాలకు పునాది వేసిందని చెబుతారు.

ఓవర్సీస్‌ మార్కెట్‌పై కన్నేసిన తెలుగు హీరోలు

టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, భారత్ సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి. సాధారణంగా పాన్-ఇండియా మూవీ టీంలు కూడా భారత్‌లోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ప్రచారం చేస్తాయి. కానీ, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు దేశాన్ని దాటి విదేశాల్లో సందడి చేస్తున్నాయి. రామ్‌చరణ్, బాలకృష్ణల దారిలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నాడా? ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ కోసం అమెరికాలో కొబ్బరికాయ కొట్టనున్నారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రిలీజ్‌కు ముందే అమెరికా వెళ్లడం వల్ల ఒక పని పూర్తవుతుందని భావిస్తున్నారు నిర్మాతలు. డాలర్ల మార్కెట్‌కు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత భారత్‌లో ప్రమోషన్స్ ప్రారంభించాలనేది కొత్త ట్రెండ్.

కాసేపట్లో తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాగల మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా హెచ్చరించింది. అంతేకాకుండా, ఈనెల 25వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటించారు.

ఓజీ బాక్సాఫీస్‌ లెక్కేంటి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థే కాల్ హిమ్ ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు, మొత్తం బాక్సాఫీస్‌కు కూడా ఒక లెక్కుంది. బాక్సాఫీస్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే, ఈసారి పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటాల్సిందే. ముందుగా, పవన్ కల్యాణ్ మునుపటి చిత్రం ‘వీరమల్లు’ బిజినెస్‌ను పరిశీలిస్తే ఆ సినిమా వరల్డ్‌వైడ్ థియేటరికల్ రైట్స్ 126 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి. అయితే, ‘ఓజీ’ విషయానికి వస్తే, దాని వరల్డ్‌వైడ్ థియేటరికల్ రైట్స్ 150-160 కోట్ల రూపాయల మధ్య ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో, సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే కనీసం 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. ఈ టార్గెట్‌ను చేరుకోవడం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, నిర్మాతలకు కీలకమైన అంశం.

మాల్దివులు మాయం కానుందా? ముప్పు ముంగిట ప్రముఖ పర్యాటక ప్రాంతం!

కొత్తగా పెళ్లి చేసుకున్న చాలా మంది నూతన దంపతుల హనీమూన్ స్పాట్, డైవింగ్ ఔత్సాహికులకు ఒక ప్రధాన గమ్యస్థానం మాల్దీవులు. ఈ అందమైన ప్రాంతం త్వరలో మాయం కానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు ఈ హిందూ మహాసముద్ర ద్వీపసమూహం తీరాలను తాకుతున్నాయి. ముంచుకొస్తున్న ఈ సముద్ర మట్టాల కారణంగా ఈ 1,200 పగడపు దీవులు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. మాల్దీవుల ఉనికి మాత్రమే కాకుండా తువాలు, కిరిబాటి, మార్షల్ దీవులు వంటి చిన్న ద్వీప దేశాల ఉనికి కూడా ముప్పులో ఉందని అంచనా వేస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది.. సముద్ర మట్టానికి ఒక మీటర్ కంటే తక్కువ ఎత్తులో మాల్దీవుల 80 శాతం భూమి ఉంది. దీని కారణంగా మాల్దీవులు కోతకు గురికావడమే కాకుండా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వాతావరణ మార్పులు వేగవంతంగా జరుగుతున్న కొద్దీ మాల్దీవులు, తువాలు, కిరిబాటి, మార్షల్ దీవులు వంటి చిన్న ద్వీప దేశాలు కనుమరుగు కావడానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట్ వరద ప్రాంతాలను పర్యటించి ఆయన మాట్లాడారు. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర కష్టాల్ని ఎదుర్కొనడం ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిందని హరీశ్‌రావు అన్నారు. సీఎం ప్రవర్తన ఆయన హోదాను కూడా తగ్గించేలా ఉందని వ్యాఖ్యానించారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు అందించాలని, అలాగే నదీ నాళాల్లో పూడికతీత పనులు వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో హరీశ్‌రావు, బహిరంగంగా కాంగ్రెస్ కండువ మార్చి పార్టీకి చేరలేదని, అలా చెప్పడం సిగ్గు తెప్పించేదని అన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక సదుపాయాలను కల్పించాలని, పంచాయతీలకు నిధులు లేక గ్రామాల్లో పాలన సమస్యలు ఏర్పడుతున్నాయని విమర్శించారు.

ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్‌.. అది చేసుంటే వేరే లెవల్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్లాప్ టాక్ వచ్చిన పవన్ సినిమాలు కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుంటాయి. అలాంటి పవన్ ఎన్నో హిట్ సినిమాను వదులుకున్నారు. అందులో ఓ ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. అదేదో కాదు ఇడియట్ సినిమా. ఈ మూవీ రవితేజకు భారీ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న రవితేజ పెద్ద హీరోగా మారిపోయాడు. పూరీ జగన్నాథ్ ఈ సినిమాను ముందుగా రవితేజతో చేద్దాం అనుకోలేదంట. అప్పటికి యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్‌ తో తీస్తే బాగుంటుందని ఆలోచించాడు. కానీ పవన్ కల్యాణ్‌ కు అప్పటికే చేతినిండా సినిమాలు ఉన్నాయి. పైగా ఇడియట్ లో హీరో పాత్ర బేవర్స్ గా ఉండటం వల్ల పవన్ కు కొంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. అందుకే తర్వాత చూద్దాం లే అని పూరీకి చెప్పాడంట. ఇక చేసేది లేక పూరీ అదే కథను పట్టుకుని రవితేజ వద్దకు వెళ్లగా ఓకే అయింది. ఇంకేముంది ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. భారీ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోయింది. ఒకవేళ అదే మూవీ పవన్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేదోమ. యూత్ మొత్తం ఊగిపోయేది.

భారత్ తేజస్ MK-2 ముందు పాక్ F-16 జుజుబీ..

తేజస్ ఫైటర్ జెట్.. ఇది నిజంగా మామూలు ఫైటర్ జెట్ కాదయ్యా. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ముందు వరుసలో నిలిచే విమానం. ఇప్పటికే భారతదేశం తేజస్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా అనేక రకాల యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తోంది. తేజస్ ప్రాజెక్టును కార్యరూపం దాల్చడానికి HAL విశేష కృషి చేస్తోంది. తేజస్ జెట్‌లో అనేక రకాల సాంకేతికతలు, ఆయుధ వ్యవస్థలను అనుసంధానిస్తున్నారు. ఇది ప్రస్తుత అధునాతన విమానాల కంటే చాలా ఎక్కువ ప్రాణాంతక సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నట్లు సమాచారం. తేజస్ కొత్త రకం యుద్ధ విమానం ముందు పాకిస్థాన్ F-16 చాలా వెనుకబడి ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికన్ F-16 కంటే మన తేజస్ కొత్త వెర్షన్ చాలా శక్తివంతమైనదిగా ఉండనుంది. తేజస్ ఫైటర్ జెట్ 4.5-తరం ఫైటర్ జెట్, కానీ దాని కొన్ని లక్షణాలు ఐదవ తరం జెట్‌ను పోలి ఉంటాయని చెబుతున్నారు. ఇక తేజస్ కన్ను పడిన చోట బుడిద కావాల్సిందే అని అంటున్నారు.

ఏ ఊరు.. ఎవ్వరి జాగీరు కాదు.. మళ్లీ మళ్లీ సిద్దిపేటకి, చింతమడకకు వస్తా

చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కవిత మాట్లాడుతూ.. “చింతమడక గ్రామం చరిత్ర సృష్టించిన ప్రదేశం. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ మొదటి అడుగు ఈ మట్టిలో నుంచే వేశారు. అందుకే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ గ్రామం నుంచి ప్రారంభమైన ఉద్యమం చరిత్రను మార్చింది. చాలా ఏళ్లుగా నేను ఇక్కడికి రాలేదు, కానీ ప్రత్యేక పరిస్థితుల్లోనూ మీ ఆహ్వానం మేరకు వచ్చాను. చిన్నప్పటి నుంచే చింతమడకలో కుల, మత భేదాలు లేకుండా పండగలు చేసుకునే వాతావరణం ఉంది. అదే నేర్పు నాకు ఎప్పటికీ ప్రేరణగా ఉంది. ఈ నేల ఇచ్చిన ధైర్యంతోనే నేను రాష్ట్రమంతా తిరిగి బతుకమ్మ నిర్వహించగలిగాను” అని చెప్పారు.

 

Exit mobile version