భారత్‌ను రెండుసార్లు విభజించిందే నెహ్రూ.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్!
భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు. దీంతో దేశంలో వ్యవసాయానికి భారీ నష్టం జరిగిందన్నారు. కొంత కాలానికి పాకిస్తాన్‌తో తాను చేసుకున్న సింధూ నది ఒప్పందంతో 80 శాతం నీరు ఆ దేశానికి వెళ్లిపోయాయని.. భారత్‌కు మాత్రం ఎలాంటి ప్రయోజనం దక్కలేదనే విషయాన్ని నెహ్రూనే స్వయంగా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీ రైతుల వ్యతిరేకి అనే దానికి ఆయన తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని ప్రధాని మోడీ విమర్శించారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహ ఘోష్ కమిషన్ నివేదికను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టులో సవాల్ చేశారు. ఇద్దరూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసి కమిషన్ నివేదికను రద్దు చేయాలని, దానిపై అమలు చర్యలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, నివేదికలో వాస్తవాలను వక్రీకరించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేసిందని కేసీఆర్, హరీష్‌రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న విధంగానే కమిషన్ తుది నివేదిక ఇచ్చిందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలను నిలిపివేయాలని, హైకోర్టు తక్షణం స్టే ఇవ్వాలని కేసీఆర్, హరీష్‌రావు తమ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఖర్చులు, సాంకేతిక లోపాలపై ఇప్పటికే రాజకీయ వివాదం కొనసాగుతోంది. జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదికలో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొంది.
నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే..
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూన రవికుమార్ మాట్లాడుతూ.. నాపై కెజిబివి ప్రిన్సిపాల్ సౌమ్య అసత్య ఆరోపణలు చేశారు.. సభ్య సమాజం ఆమె ఆరోపణలు చూసి తలదించుకునే విధంగా ఉన్నాయి.. జెడ్పిటిసి నుంచి ఎమ్మెల్యేగా వివిధ పదవులు నిర్వహించాను.. నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయటం దారుణం.. వైసీపీ తోక నాయకులు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. నేను శారీరకంగా మానసికంగా హింసించినట్టు ఆధారాలు చూపించు.. తల్లిదండ్రుల ఫిర్యాదులు వస్తే ఎమ్మెల్యే గా ఎవరితోనైనా మాట్లాడతాను.. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. తప్పు చేసి ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. నీ డిగ్రీలు నా దయ దాక్షిణ్యంతో వచ్చినవే అని అన్నారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టుకు కేసీఆర్, హరీష్ రావు
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహ ఘోష్ కమిషన్ నివేదికను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టులో సవాల్ చేశారు. ఇద్దరూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసి కమిషన్ నివేదికను రద్దు చేయాలని, దానిపై అమలు చర్యలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, నివేదికలో వాస్తవాలను వక్రీకరించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేసిందని కేసీఆర్, హరీష్‌రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న విధంగానే కమిషన్ తుది నివేదిక ఇచ్చిందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలను నిలిపివేయాలని, హైకోర్టు తక్షణం స్టే ఇవ్వాలని కేసీఆర్, హరీష్‌రావు తమ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఖర్చులు, సాంకేతిక లోపాలపై ఇప్పటికే రాజకీయ వివాదం కొనసాగుతోంది. జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ నివేదికలో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొంది.
రాబోయే 48 గంటలు జాగ్రత్త.. ముంబైలో వర్షాలపై దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరిక..
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాయగడ్ జిల్లాలో ఇవాళ (ఆగస్టు 19న) ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా ఆకాలంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతల్లో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. ఇక, ముంబై, థానే, పూణె నగరాల్లో భారీ వర్షాలతో పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఇక, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివాసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, అసద్‌కు విజ్ఞప్తి చేస్తున్నా
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ .. “జస్టిస్ సుదర్శన్‌రెడ్డి మా పార్టీ ప్రతినిధి కాదు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయకోవిదుడు అవసరం. చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, అసదుద్దీన్ తదితర నాయకులు కూడా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించేందుకు మద్దతు ఇవ్వాలి” అని విజ్ఞప్తి చేశారు.
భర్త హత్యకు గూగుల్‌ను ప్లాన్ అడిగింది..
కలకాలం ఒకరికి ఒకరు తోడునీడగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి, తీరా జీవితాంతం తోడుగా నిలిచే భాగస్వాములను క్షణాల్లో ఖతం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కోవకు చెందినదే ఈ వార్త కూడా. కానీ ఇక్కడ ఓ సంచలన విషయం ఏంటంటే.. తన భర్తను చంపడానికి ఓ భార్య గూగుల్‌ను ప్లాన్ అడగటం. తన భర్తను హత్య చేసిన తర్వాత తప్పించుకునే మార్గాలను ఆమె గూగుల్, సోషల్ మీడియాలో వెతికినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంచలన ఘటన జైపూర్‌లో వెలుగుచూసింది.
విద్యుత్ శాఖలో చలనం.. కేబుళ్ల తొలగింపుపై డిప్యూటీ సీఎం ఆదేశాలు
హైదరాబాద్ మహానగరంలో పండగ వేళ విషాదం వరుసగా దాడి చేస్తోంది. గత రెండు రోజుల్లోనే కరెంట్ షాక్‌ల కారణంగా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతాపూర్ గోఖుల్‌నగర్‌లో నిర్వహించిన రథోత్సవం సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
మంగళవారం చాంద్రాయణగుట్ట బండ్లగూడలో మరో విషాదం చోటు చేసుకుంది. 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని తరలించే సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు.. ధోని (21), వికాస్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు అంబర్‌పేటలో కూడా ప్రమాదం జరిగింది. వినాయక మండపానికి పందిరి కడుతున్న సమయంలో కరెంట్ వైర్లు తగలడంతో రామ్ చరణ్ అనే వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అతడి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సాఫ్ట్ వేర్ జాబ్స్ గాల్లో దీపాలేనా?.. భారతీయ ఉద్యోగులపై ఒరాకిల్ పిడుగు..
ఐటీ సెక్టార్ లో ఉన్నవారికే కాదు.. ఇందులో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి కూడా షాకిస్తున్నాయి ఐటీ కంపెనీలు. లక్షల్లో ప్యాకేజీలు, వీకెండ్ పార్టీలు, ఫారిన్ ట్రిప్పులు ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఎప్పుడు జాబ్ పోతుందో అని ఐటీ ఉద్యోగులు వణికిపోతున్నారు. దిగ్గజ ఐటీ సంస్థలు గత కొంత కాలంగా ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తూ.. వణికిస్తు్న్నాయి. ఇకపై సాఫ్ట్ వేర్ జాబ్స్ గాల్లో దీపాలేనా? అని అంతా చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన ఒరాకిల్, భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 10 శాతం మందిని తొలగించినట్లు సమాచారం. దేశంలో 28,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
డీఎస్సీ 2025 పై కీలక నిర్ణయం.. వెబ్‌సైట్ లోకి మెరిట్ లిస్ట్ విడుదల..
డీఎస్సీ 2025 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్ లోకి మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు అధికారులు. ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచారం ఇవ్వనున్నారు. 21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లో కి కొత్త ఉపాధ్యాయులు కొలవుదీరనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మెగా డీఎస్సీ 2025 నిర్వహించింది.
