నేడే ఏపి క్యాబినెట్ భేటీ.. పలు ప్రాజెక్టులకు ఆమోదం..!
నేడు (జూన్ 24) ఉదయం 11 గంటలకు ఏపి క్యాబినెట్ భేటీ అమరావతి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు కు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి కూడా ఆమోదం తెలపనుంచి క్యాబినెట్. సీడ్ యాక్సెస్ రోడ్ ను నేషనల్ హైవే – 16 కు కలిపేందుకు 682 కోట్లతో టెండర్లు పిలిచెందుకు సంబంధిచి క్యాబినెట్ లో అమోదం తెలపనున్నారు.
నేడు రూ.300ల దర్శన టికెట్స్ విడుదల.. వసతి గదులు కోటా కూడా..!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆన్‌లైన్ దర్శన టికెట్లను నేడు (జూన్ 24) విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ రూ.300 దర్శన టికెట్లు అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల కానున్నాయి. భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ లేదా టీటీడీ అధికారిక యాప్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి లలోని వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు తమ ప్రయాణ తేదీలను అనుసరించి గదుల బుకింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు వీలైనంత త్వరగా టికెట్లు, గదులను బుక్ చేసుకుంటే స్వామి దర్శన సమయంలో సౌకర్యంగా ఉంటుంది. ఇక సోమవారం నాడు అంగప్రదక్షణ టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, వయోవృద్ధుల, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇరాన్ నుంచి.. ఢిల్లీ చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు!
ఇజ్రాయెల్ -ఇరాన్ ఘర్షణ సంక్లిష్ట రూపం దాల్చిన నేపథ్యంలో.. అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ‘ఆపరేషన్ సింధు’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి 10 మంది ఏపీ విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చే బాధితుల కోసం విదేశాంగశాఖ ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి వచ్చే బాధితుల కోసం ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో రెండు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. విద్యార్థులను ఢిల్లీ నుంచి స్వస్థలానికి పంపేందుకు రెసిడెంట్ కమిషనర్లు 2 టీమ్‌లను నియమించారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన విదేశాంగ శాఖ ఇప్పటి వరకు దాదాపు 1750 మంది భారతీయులను ఇరాన్ నుండి స్వదేశానికి చేర్చింది. ఇప్పటికే బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుండి విద్యార్థులు వచ్చారు.
పోలీస్ కస్టడీకి వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు!
టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నలుగురు నిందితులను జూన్ 24 నుంచి 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన బోర్లగుంట వినోద్ కుమార్, ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి, గోళ్ల రుత్యేంద్రబాబు, ఓబిలి నాగరాజును పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. నేటి నుంచి నిందితులు నలుగురిని పోలీసులు విచారించనున్నారు. ఏప్రిల్ 22న ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురయ్యారు. 22న సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒంగోలులోని ఆయన కార్యాలయంలో విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసింది కిరాయి ముఠా. నిందితులు వీరయ్య చౌదరిని 53 సార్లు పొడిచి హతమార్చిన అనంతరం స్కూటీ, ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. 50 బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముందుగా అమ్మనబ్రోలు, నాగులుప్పలపాడుకు చెందిన ప్రధాన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పోలీసులు కస్టడీకి కోరారు. హత్య కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ముప్పా సురేష్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నాడు.
నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!
నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయిన విషయం తెలిసిందే. సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చించనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి రెండో దశలో 44 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశంలో కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు అమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఏడాది పాలన పూర్తియిన సందర్బంగా కేబినెట్‌లో చర్చ జరగనుంది. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
పాలు పగిలినై.. గట్లెట్ల పలుగుతై.. పోలీస్ స్టేషన్ కు బాధితుడు
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అరుదైన కేసు నమోదైంది. సాధారణంగా చోరీలు, ఘర్షణలు, ఆస్తి వివాదాల ఫిర్యాదులు వస్తుంటే… ఈసారి మాత్రం పాలు పగిలిపోయాయని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. సంఘటన కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో చోటు చేసుకుంది. బాధితులు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాకెట్ పాలలో మొదటి ప్యాకెట్ కాచినప్పుడు సాధారణంగానే కనిపించిందని, అయితే రెండవ ప్యాకెట్ కాచేసరికి పూర్తిగా పగిలిపోయిందని తెలిపారు. ఇది ఏంటని అడిగితే, దుకాణదారుడు బాధ్యత వహించలేమని తేల్చి చెప్పారు. దీంతో అసంతృప్తికి గురైన బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు.
చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. కేబుల్ కత్తిరించి..!
ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దుండగులు పథకం ప్రకారం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే సిగ్నల్ వ్యవస్థకు చెందిన కేబుల్‌ను కత్తిరించారు. దీంతో సిగ్నల్ అందక చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. రైలు ఆగిన వెంటనే దుండగులు బోగీల్లోకి ప్రవేశించి.. ప్రయాణికులను కత్తులతో బెదిరించారు. ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. అనంతరం దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. 22159 రైల్లో యస్-1 భోగిలో గుత్తికి చెందిన విశాలాక్షి అనే మహిళ మెడలో నుంచి సుమారు 27 గ్రాముల బంగారు చైన్‌ను దుండగులు లాక్కెళ్లారు.
పాలు పగిలినై.. గట్లెట్ల పలుగుతై.. పోలీస్ స్టేషన్ కు బాధితుడు
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అరుదైన కేసు నమోదైంది. సాధారణంగా చోరీలు, ఘర్షణలు, ఆస్తి వివాదాల ఫిర్యాదులు వస్తుంటే… ఈసారి మాత్రం పాలు పగిలిపోయాయని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. సంఘటన కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో చోటు చేసుకుంది. బాధితులు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాకెట్ పాలలో మొదటి ప్యాకెట్ కాచినప్పుడు సాధారణంగానే కనిపించిందని, అయితే రెండవ ప్యాకెట్ కాచేసరికి పూర్తిగా పగిలిపోయిందని తెలిపారు. ఇది ఏంటని అడిగితే, దుకాణదారుడు బాధ్యత వహించలేమని తేల్చి చెప్పారు. దీంతో అసంతృప్తికి గురైన బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు.
డ్రగ్స్ కేసులో నటుడు ‘శ్రీరామ్’ కు రిమాండ్
తెలుగు, తమిళ్ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో పోలీసులు చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులకు సమాచారం రావడంతో అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. పోలీసుల స్టైల్ లో విచారణ చేపట్టగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేస్తామని నిందితులు తెలిపారు. రంగమంలోకి దిగిన పోలీసులు శ్రీరామ్ అదుపులోకి తీసుకుని ఆయన వద్ద నుండి కొకైన్ స్వాదీనం చేసుకున్నారు. అనంతరం శ్రీరామ్ ను అరెస్ట్ చేసారు. వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాల సేకరించి నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు పోలీసులు. తదుపరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీరామ్ ను కోర్టులో హాజరుపరచగా జులై ఏడవ తేది వరకు రిమాండ్ విధించింది చెన్నై ఎగ్మోర్ కోర్టు. ఈ నేపథ్యంలో నటుడు శ్రీరామ్ ని కస్టడీ కోరుతూ నేడు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు నుంగంబాకం పోలీసులు. శ్రీరామ్ ను విహచరిస్తే కోలీవుడ్ కు చెందిన పలువురు నటుల పేర్లు బయటకు వస్తాయని భావిస్తున్నారు. అన్నాడీఎంకే కు చెందిన ప్రసాద్ కు పలువురి తమిళ సినిమా నటులతో పరిచయాలు ఉన్నాయని అటువైపుగా కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. శ్రీరామ్ డ్రగ్స్ లో ఇతర నటినటులు ఎవరు ఉన్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎలా తెస్తున్నారు. ఎవరు దీని వెనకఉన్నారు అని పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
