NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోన్న రామాలయం.. మారిపోయిన అయోధ్య రైల్వే స్టేషన్‌ పేరు

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్ పేరును మార్చేసింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామా కరణం చేసింది. రైల్వే స్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రైల్వే శాఖ ముందుకు తీసుకుపోగా.. ఆ ప్రతిపాదనకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అయోధ్య రైల్వే జంక్షన్ కాస్తా.. అయోధ్య ధామ్ జంక్షన్’గా మారిపోయింది.

ఎంతో కష్టంగా ఉన్నా.. నా అభిమానుల కోసమే ఇదంతా: ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హెయిర్‌స్టైల్స్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహీ ఎప్పుడూ డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్స్‌తో అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. మహీ తన కెరీర్‌లో ఎన్నో రకరకాల హెయిర్‌స్టైల్స్‌ మెయింటైన్ చేస్తూ ట్రెండ్‌ సెట్టర్‌గా మారాడు. ధోనీ ఎన్ని హెయిర్‌స్టైల్స్‌ మార్చినా.. కెరీర్ ఆరంభంలో టార్జన్ త‌ర‌హా హెయిర్‌స్టైల్‌ను ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. మ‌ళ్లీ ఇప్పుడు దాదాపుగా అలాంటి హెయిర్‌స్టైల్‌తో ద‌ర్శన‌మిస్తున్నాడు. ఓ యాడ్ షూట్ కోసం ధోనీ ఈ హెయిర్‌స్టైల్‌ మెయింటైన్ చేస్తున్నాడు. తాజాగా ఈ హెయిర్‌స్టైల్‌పై స్పందించాడు.

మోస్ట్ అవైటెడ్ పోస్ట్ వచ్చేసింది… సలార్ @ 500 క్రోర్స్

పాన్ ఇండియా స్టార్ కంప్లీట్ గా తన స్టైల్ ఆఫ్ మాస్ సినిమా చేసి చాలా రోజులే అయ్యింది. హిట్ కోసం ఆకలిగా ఉన్న అభిమానులు ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాని ఇచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మాస్ ఇలా కూడా ఉంటుందా అనిపించే రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇంపాక్ట్ ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మారుస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ప్రతి రోజూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న సలార్ సినిమా మొదటి మూడు రోజుల్లో రోజుకి వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. డే వన్ 178 కోట్లు, డే 2-117 కోట్లు, డే-107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. మొత్తంగా మూడు రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సలార్… నాలుగో రోజు 450 కోట్ల మార్క్ దాటి 200 కోట్ల షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

హైదరాబాద్ బిర్యానీకి మరో అరుదైన గుర్తుంపు..

ఈ ప్రపంచంలో హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరు లెవల్ అనుకోండి.. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన దొరుకుతుంది. మొన్న స్విగ్గీలో అత్యధిక ఆర్డర్లు పెట్టిన ఆహారంగా కూడా మన హైదరాబాద్ బిర్యానీనే రికార్డులకెక్కి్ంది. తాజాగా, ట్రావెల్ గ్లోబల్.. ఈట్ లోకల్ అనే అంశంతో పని చేసే ప్రముఖ పర్యాటక ఆన్ లైన్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ఉత్తమ ఆహార పరదార్థాల జాబితాలో కూడా మన హైదరాబాద్ బిర్యానీ స్థానం దక్కించుకుంది.

ఆ మాటకే కట్టుబడి ఉన్నా.. ఈ సారి పోటీ నుంచి తప్పుకుంటున్నా..

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ కనిపిస్తోంది.. అయితే, కొందరు ఎమ్మెల్యేలకు సీటు కూడా దక్కకుండా పోతోంది.. మంత్రులు సహా పలువురు నేతలు సీట్లు మారుతున్నాయి.. ఈ తరుణంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు.. అయితే, రానున్న ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. మరోవైపు, పలువురు పార్టీ నియోజకవర్గ నేతలు తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంటపై తీవ్ర విమర్శలు చేశారు అన్నా రాంబాబు..

బతుకమ్మ ఆడగానే హిందూ మతాన్ని గౌరవించినట్టా?.. జీవన్‌ రెడ్డి హాట్‌ కామెంట్‌

బతుకమ్మ ఆడగానే హిందూ మతాన్ని గౌరవించినట్లా? అని ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా.. ఎమ్మెల్యే జిల్లా డీసీసీ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ తో కలిసి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కవిత ఏంది అసలు నాకు అర్ధం కాదు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలని అన్నారు. యూనియన్ లొ ఉండి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే స్థాయి కూడా కోల్పోయిందన్నారు. పథకాల అమలులో ఎలాంటి అనుమానం అక్కరలేదని, తప్పకుండ అన్ని అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇవ్వమంటే ఇవ్వడం లేదు.. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేసి తీరుతామన్నారు. దొరసాని (ఎమ్మెల్సీ కవిత) 5 యేండ్లు పదవిలో ఉండి ఎం చేసిందన్నారు. ఉన్న చక్కర ఫ్యాక్టరీ మూసేయించిందని, కానీ దానిని మేము తెరిపించబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ సభ్యురాలుగా ముఖ్యమంత్రి తనయ గా ఆమె ఏం చేయలేదని మండపడ్డారు.

సీటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోవడమే మంచిది..

వైసీపీ ఎమ్మెల్యే సీట్ల మార్పు, షర్మిళ కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ప్రచారాలపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. షర్మిళ కాంగ్రెస్ లో చేరిక ఆమె వ్యక్తిగతం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చు.. కాంగ్రెస్ లో చేరినా, కేఏ పాల్ పార్టీలో చేరిన తమకేం సంబంధం లేదని తెలిపారు. సీటిస్తేనే పార్టీలో ఉంటాము అనే నాయకులు వెళ్లిపోవడమే మంచిదని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైసీపీదని మంత్రి చెప్పారు.

అచ్చెన్నాయుడు కామెంట్స్‌కు మంత్రి జోగి రమేష్ కౌంటర్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌పై మంత్రి జోగి రమేష్ స్పందించారు. నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ. 10లక్షల కోట్ల అప్పులు చేసిందని, హామీల్లో సీఎం జగ్ 85 శాతం ఫెయిల్ అయ్యారని అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగున్నర ఏళ్ళల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చామన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన పథకాలను వివరించటం చరిత్రలో జరగలేదన్నారు.

13 మందిని బలిగొన్న ఫిట్‌నెస్ లేని బస్సు.. బీజేపీ నేతకు చెందినదిగా గుర్తింపు

మధ్యప్రదేశ్‌లోని గుణాలో బుధవారం జరిగిన ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సులో ‘ఫిట్‌నెస్ సర్టిఫికేట్’ లేదని గుర్తించారు. ఇక, ఆ బస్సు బీజేపీ నేతకు చెందినదని తెలిసింది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుణ-ఆరోన్ రోడ్డులో బస్సు డంపర్‌ను ఢీకొనడంతో మొత్తం 13 మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు అగ్నిగోళంగా మారింది. ఈ ప్రమాదంలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇది ఫ్యూడల్ ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఐదు హామీల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభల ద్వారా పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారుల గుర్తింపునకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

సీఎం జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారు..

ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ నుంచి 3 వేల పెన్షన్ అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారమని అన్నారు. మూడో తేదీన పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని చెప్పారు. వచ్చేనెల 4 ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయని.. అంతేకాకుండా, వైయస్సార్ ఆసరా చేయూత లబ్ధిదారులకు సీఎం జగన్ నగదు జమ చేయమన్నారని అన్నారు. 404 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

సీఐటీయూతో చర్చలు.. మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం.

మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న సీఐటీయూతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. అయితే.. సీఐటీయూతో మంత్రి సురేష్ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సమ్మె విరమించాలని మంత్రి సురేష్ వారిని కోరారు. ఈ క్రమంలో.. చర్చల సారాంశాన్ని కార్మికులకు చెప్పి సమ్మె కొనసాగింపా..? విరమణా..? అనే విషయం తెలియచేస్తామని సీఐటీయూ చెప్పింది. కార్మికుల నుంచి క్లారిటీ తీసుకున్నంత వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. సీఐటీయూ 13 డిమాండ్లల్లో మూడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం చెప్పింది. జీతం పెంపు లేదా సర్వీసుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. మరోవైపు.. సమ్మెలో లేని సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు జరుపుతున్నారు.

గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు

ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిందని, అన్ని ఏరియాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్మికులను రాయితీలతో ప్రలోభాలకు గురి చేశారన్నారు ఏఐటీయూసీ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదన్నారు. మణుగూరు లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంతో రెండు ఓట్ల వ్యత్యాసంతో ఓటమిపాలయం. రీకౌంటింగ్ కి అపిల్ కి పోతమన్నారు. ఆఫీసులో అడ్రస్సులు బ్యానర్లు లేకుండా రాత్రికి రాత్రికి మంత్రి రాకతో ప్రలోబాలకు గురిచేసి ఓట్లు గుంజుకున్నారని ఆయన మండిపడ్డారు. కార్మిక సమస్యలపై గుర్తింపు సంఘంగా చట్టసభల్లో మాట్లాడి కార్మికులకు లబ్ధి చేకూరుస్తామన్నారు రంగయ్య.