బార్డర్‌లో పాక్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన వీర వనిత..
పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్‌ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషి కాగా మరొకరి పేరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషి భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్‌కు చెందిన అధికారిణి. లెఫ్టినెంట్ కల్నల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్. వీరి ధైర్య సాహసాల గురించి అందరం చదివాం. అదే స్థాయిలో మరో కమాండర్ కూడా ఉన్నారు.
కమల్‌హాసన్‌కు ఆ విషయం తెలియదు.. ముఖ్యమంత్రి అసహనం
కన్నడ భాషపై అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన నటించిన కొత్త సినిమా ‘థగ్ లైఫ్’ను బ్యాన్ చేయాలంటూ కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇటు పొలిటికల్‌గా.. అటు రెండు రాష్ట్రాల మధ్య తగాదాగా తయారైంది. ఈ వ్యవహారంపై తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కమల్‌హాసన్‌కు చరిత్ర తెలియదని.. అందుకే ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు..
తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మహానాడుపై రాష్ట్ర ప్రజలు ఎన్నో అశలు పెట్టుకున్నారు అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా లేదు.. ఆత్మస్తుతి పరనింద తప్ప మహానాడులో ఏం లేవు.. వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగులు వేసి భజన చేసుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచిక ఆనందం పొందారు.. మీరు చేసిన దుష్ప్రచారం అందరికీ తెలుసు.. బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారింటీ పేరు హామీలు ఇచ్చారు.. అన్నీ హామీలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో మీ స్థానంతో సహా ఓటమి తప్పదు.. ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు.. కూటమి ప్రభుత్వంపై ఆరు నెలలకే ప్రజల్లో అసంతృప్తి మొదలైందని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు.
టీడీపీలో కోవర్టులు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
మహానాడులో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంత మంది ప్రత్యర్థులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా ఉంటున్నారు అని ఆరోపించారు. వాళ్ళ ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. ఇప్పుడు నేను ఎవరినీ నమ్మడం లేదు.. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలి పెట్టనని హెచ్చరించారు. 1995 నుంచి నేను జాతీయ అధ్యక్షుడుగా ఉన్నాను.. నా బలం నా బలగం నా కార్యకర్తలు మా నాయకులే.. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది.. 43 ఏళ్లగా మహానాడు నిర్వహిస్తున్నాను.. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహానాడు అద్భుతంగా జరిగింది.. దీన్ని నా జీవితంలో మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ- గ్రీన్ ఎనర్జిటిక్ స్టేట్ గా క్రియేట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జిటిక్ అప్పుగా మారబోతుంది.. కరెంట్ ఛార్జీలు పెంచను అని ఆ రోజే చెప్పాను దానికి నేను కట్టుబడి ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. నేను గెలిచిన తర్వాత ఒక్క పైసా పెంచకుండా ఉన్నాను.. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి.. పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి ఉద్యోగాలు రావాలి.. ఇక, విశాఖపట్నం ఒక స్టిల్స్ జిల్లాగా తయారవుతుంది అని సీఎం చంద్రబాబు తెలిపారు.
బేబిలాన్ పబ్‌లో దారుణ ఘటన.. లైట్స్ ఆపి తన తల్లి, చెల్లిని…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని బేబిలాన్ పబ్‌లో దారుణం జరిగిందని ఇన్‌ప్లుయెన్సర్ మీనల్ ఫిర్యాదు చేశారు. తన తల్లి, చెల్లిని లైట్స్ ఆపి కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మీనల్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్లు వేసి, అదಕ್ಕೆ డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. సిబ్బందిని నిలదీయగా, వారి మీద తాము కుప్పకూలించారని, వెంటనే లైట్స్ ఆపి, మద్యం సేవల సిబ్బంది తల్లిని, చెల్లిని కొట్టారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. పోలీసులు పబ్ సిబ్బందిని విచారించగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నగరంలో అటువంటి పబ్‌లలో వినియోగదారుల భద్రత, సేవల నాణ్యత పై అధికారులు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉన్నట్లు ఈ సంఘటన గుర్తుచేస్తోంది.
లిఫ్ట్‌లో ఇరుక్కున్న కొడుకు.. భయాందోళనతో తండ్రి మృతి
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుమారుడు లిఫ్ట్ ఎక్కగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భయాందోళనకు గురై ఏడ్వడం మొదలుపెట్టాడు. బిడ్డకు ఏమైందో ఏమోనని ఆ తండ్రి కంగారు పడ్డాడు. వెంటనే జనరేటర్ కోసం అపార్ట్‌మెంట్ కిందకి పైకి ఎక్కుతూ గుండె అలసిపోయింది. అంతే అక్కడికక్కడే తండ్రి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఇంతలోనే కరెంట్ రావడంతో కుమారుడు క్షేమంగా బయటకు వచ్చాడు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. కుటుంబ రోదన వర్ణణాతీతం అయింది.
ఇందిరమ్మ అమృతం.. బాలికల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో, కౌమార బాలికలలో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు మరో కీలక చర్య తీసుకుంది. ‘‘ఆడపిల్లలకు శక్తినిద్దాం… ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’’ అనే నినాదంతో ‘‘ఇందిరమ్మ అమృతం’’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 14 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి బాలికకు నెలకు 30 చిక్కీలు ఇవ్వబడతాయి. ఒక్కో చిక్కీలో సుమారు 600 కేలరీల శక్తి, 18–20 గ్రాముల ప్రొటీన్లు, అవసరమైన మైక్రో న్యూట్రియంట్లు ఉంటాయి.
ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు..
నైరుతి ఋతుపవనాలు బుధవారం ( మే 28) నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉన్నందున గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై వరద ప్రభావిత జిల్లాల అధికారా యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశామని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
పార్టీ ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ వరుసగా సమావేశాలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆంతర్యాన్నిపరిపాలించేందుకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తిరిగి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. హైదర్‌గూడలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆమె లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు.
