Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఆ 25 ఎకరాల టీటీడీ భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు..?

అలిపిరి రోడ్డులోని రూ. 1500 కోట్లకు పైగా విలువ చేసే 25 ఎకరాల తిరుమల తిరుపతి దేవాస్థానం భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ బోర్డు మీటింగ్ లో మా అభ్యంతరాలను తిరస్కరించారు.. దేవుడు భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదా.. 25 ఎకరాల టీటీడీ ల్యాండ్ ను టూరిజం శాఖకు ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దమ్ముంటే ఆ 10 నియోజకవర్గాల్లో రాజీనామా చేయండి.. కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్!

పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో బై ఎలక్షన్ తప్పక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 3 నెలలు లేకుంటే.. 6 నెలల సమయంలో ఎన్నికలు వస్తాయన్నారు. దమ్ముంటే పార్టీ మారిన నియోజకవర్గాల్లో రాజీనామా చేసి రండి ఎన్నికలకు రండి అని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలకు వెళితే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుందన్నారు. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్‌కు బై బై చెప్పే ఎన్నికలు అవుతాయని విమర్శించారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు.

స్టీల్ ప్లాంట్‌పై జనసేన వైఖరి ప్రకటించాలన్న వైసీపీ.. మంత్రి నాదెండ్ల స్ట్రాంగ్ కౌంటర్

ఈ నెల 30వ తేదీన విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం కోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి 15 వేల మంది ఆహ్వానితులు వస్తుండగా.. పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యచరణ కోసం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా విశాఖలోని ఇందిరా ప్రయదర్శినీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను కార్పొరేటర్లతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు.

సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం!

సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు వెళ్లిన భట్టి.. సుధాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. మనం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయాం అని అన్నారు. చిన్న నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి.. ప్రజల కోసం పోరాడారన్నారు. సురవరం రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం.. మూడు సార్లు రన్‌వేపైకి వెళ్లి..!

విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలతో వెనుతిరగడం లాంటి వార్తలు గతంలో ఎప్పుడోసారి చర్చనీయాంశంగా మారేవి. ఇటీవలి రోజుల్లో మాత్రం రోజుకో ప్రమాద ఘటన జరుగుతుండడంతో సాధారణ వార్తగా మారిపోయింది. ఎన్నో ప్రమాదాలు, సాంకేతిక లోపాలు బయటపడుతున్నా.. విమానాలకు సంబంధించిన కంపెనీలు మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటున్నాయి. తాజాగా ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.

గ్రేటర్ నోయిడా అదనపు కట్నం కేసులో ట్విస్ట్.. భర్తపై కాల్పులు జరిపిన పోలీసులు..

వరకట్నాలు, అదనపు కట్నపు వేధింపులు ఎక్కువైపోతున్నాయి. డబ్బు కోసం భార్యల ప్రాణాలు తీస్తున్నారు కొంతమంది భర్తలు. గ్రేటర్ నోయిడాలో నిక్కీ భాటి అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఆమె భర్త విపిన్ భాటి, అత్తమామలు కలిసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితురాలి కొడుకు తన తండ్రే అమ్మను కాల్చి చంపాడని పోలీసులకు తెలిపాడు.

బాలయ్యకి అరుదైన గౌరవం

భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు సాధించిన నట సింహం నందమూరి బాలకృష్ణకి మరో అరుదైన గౌరవం దక్కింది. నందమూరి బాలకృష్ణ సినిమా జైత్రయాత్రకు మరో అద్భుత గౌరవాన్ని అందుకుంటున్నారు. లండన్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR), యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, సహా యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ. ఆ సంస్థ బాలకృష్ణ ఐదు దశాబ్దాల సినిమా సేవలను WBR గోల్డ్ ఎడిషన్‌లో నమోదు చేస్తూ, ఆయనను తమ అత్యంత ప్రతిష్టాత్మక గౌరవంతో సత్కరిస్తోంది. ఈ గుర్తింపు ఆయన అసమాన సినిమా వారసత్వానికి, సామాజిక సేవలకు, మానవతావాదానికి ఒక శాశ్వత నివాళిగా నిలవనుంది.

జాడలేని విమానం.. 22 రోజులుగా మిస్సింగ్..

ఓ విమానం మిస్ అయ్యింది. నిజం అండి బాబు.. ఎవరికైనా చిన్నచిన్న వస్తువులు, వాహనాలు మిస్ కావడం తెలుసు. కానీ ఇక్కడ విచిత్రంగా ఓ విమానం మిస్ అయ్యింది. ఈనెల 2న ఆస్ట్రేలియా ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓ విమానం అదృశ్యం అయ్యింది. ఇప్పటికి 22 రోజులు గడిచాయి, కానీ దాని జాడ మాత్రం ఎక్కడ కనిపించలేదు. దానికి సంబంధించిన ఎటువంటి డిస్ట్రెస్ సిగ్నల్, రేడియో కాంటాక్ట్ లేదని అధికారులు చెప్తున్నారు. 72 ఏళ్ల గ్రెగొరీ వాఘన్, అతని 66 ఏళ్ల భాగస్వామి కిమ్ వార్నర్, వారి పెంపుడు శునకం మోలీ ప్రయాణిస్తున్న ఈ విమానం ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబులో భయం మొదలైంది.. చెప్పేవన్నీ అబద్ధాలే..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ.. 2019లో 23 సీట్లు ఓటు షేర్ కంటే 2024లో. 2.5 శాతం జగన్ కు అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు జరిగితే కూటమి ఓడిపోతుందని చంద్రబాబుకు అర్థం అయిపోయింది.. సింగపూర్ లో ఇన్వెస్టర్లకు అర్థమైంది.. చంద్రబాబు భయంతో ఆరోపణలు చేస్తున్నారు.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి పడిపోయిందంటే కారణం చంద్రబాబే.. చంద్రబాబు దుర్మార్గం కారణంగానే పోలవరం ప్రాజెక్టు జాప్యానికి కారణం అని తెలిపాడు.

 

Exit mobile version