Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రిచెస్ట్ వినాయకుడు.. ఏకంగా రూ. 474 కోట్లతో ఇన్సూరెన్స్

ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే గణపయ్య భక్తులు విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. ఊరు వాడలు వినాయక మండపాలతో ముస్తాబవుతున్నాయి. కాగా గణేష్ వేడుకలకు ముందే ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ హాట్ టాపిక్ గా మారింది. తమ వినాయకుడికి ఏకంగా రూ. 474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. దీంతో రిచెస్ట్ గణపతిగా రికార్డ్ సృష్టించాడు. గతేడాది కూడా రికార్డ్ స్థాయిలో రూ. 400 కోట్లు, 2023లో రూ. 360 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంది. ఈ ఇన్సూరెన్స్ వినాయకుడి బంగారం, సిల్వర్ అభరణాలతో పాటు, వాలంటీర్లు, పూజారులు, సెక్యూరిటీ గార్డులు, సిబ్బందిని, దర్శనానికి వచ్చే భక్తులను కవర్ చేస్తుంది.

వ‌ర‌ద‌లో భారీగా కొట్టుకు వ‌చ్చిన కండోమ్స్.. ఇన్ని ఏంటయ్యా?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలో ఉన్న నదులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో వరద మరింత బీభత్సం సృష్టించడంతో కొన్ని ఊర్ల మధ్య రాకపోక సంబంధాలు తెగిపోయాయి. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో పంట నష్టం కూడా జరిగిందని సమాచారం. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రాణ నష్టం కాకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.

రోడ్డుపై బైఠాయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రికి అనుమతిచ్చేవరకు ఇక్కడే కూర్చుంటా..!

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి ఎంట్రీకి బ్రేక్‌ వేశారు పోలీసులు.. హైకోర్టు ఆదేశాలతో ఉదయం తాడిపత్రికి వెళ్తున్న పెద్దారెడ్డిని నారాయణరెడ్డి పల్లె వద్ద అడ్డుకున్నారు పోలీసులు.. దీంతో, రోడ్డుపై బైఠాయించారు పెద్దారెడ్డి.. దాదాపు 4 గంటలుగా నారాయణరెడ్డి పల్లె వద్ద రోడ్డుపై బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే, తాడిపత్రి వైపు వెళ్లకుండా బారికేట్స్ ఏర్పాటు చేసిన పోలీసులు.. భారీగా మోహరించారు.. కానీ, పెద్దారెడ్డి వచ్చే సమయంలోనే తాడిపత్రిలో శిశుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. దీంతో, ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది..

మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్లు ఉండవు.. రాహుల్ గాంధీ సూచనలను అమలు చేయడమే మా లక్ష్యం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్ధార్ సర్వాయి పాపన్నకు సముచిత గౌరవం ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. సర్ధార్ పాపన్న విగ్రహం ఏర్పాటు కోసం శంకుస్థాపన నిర్వహించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వం హుస్నాబాద్‌లోని పాపన్న కోటను లీజుకు ఇచ్చిందని, తాము అయితే ఆ కోటను సంరక్షించడానికి చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్‌ను పోటీ చేయించడం కూడా అదే భావనలోనుంచే జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ గాంధీ కుటుంబాన్ని “దేశానికి గొప్ప వరం”గా అభివర్ణిస్తూ.. వారిచ్చే హామీ శిలాశాసనం లాంటిదేనని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సూచించినట్లుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా కుల గణనను నిబద్ధతతో పూర్తి చేసామని, తాము చేసిన సర్వేలో తప్పు ఎక్కడ ఉందో చూపించమని అసెంబ్లీలోనే సవాల్‌ చేశామని ఆయన పేర్కొన్నారు.

రాబోయే 24 గంటలు భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్

రాబోయే 24గంటల పాటు తెలంగాణకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా పేర్కొంది. ఇందులో భాగంగా నాలుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే 19 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ జిల్లాలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

దారుణం.. ఒంటరిగా ఉన్న బాలికను హతమార్చిన దుండగులు..!

సమాజంలో రోజురోజుకి దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వావివరసలు మరిచి కొందరు దారుణాలకు వడిగడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రాంతంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు హత్య చేశారు. అందిన సమాచారం ప్రకారం తల్లిదండ్రులు పని కోసం బయలుదేరిన తర్వాత బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అయితే, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తెను చనిపోయిన స్థితిలో కనుగొన్నారు. దానితో ఆ విషయాన్నీ స్థానికులకు తెలిపాడు తండ్రి. దీనితో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ పోలీస్ బృందం, డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌లతో కలసి ఘటనపై ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

డేటా సిటీ ఏర్పాటుకు సహకరించండి.. జైశంకర్‌ను కోరిన లోకేష్‌

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు.. తన పర్యటనలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను కలిసిన లోకేష్.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయస్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందించండి. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతోపాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు.. వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి కి సింగపూర్ ప్రభుత్వం తో జరిగిన చర్చల గురించి లోకేష్ వివరించారు.

అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం

తెలంగాణలో కుల గణనను పగడ్బంధీగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుల గణనను పూర్తి చేశామని, వందకు వంద శాతం సరిగ్గా లెక్కలు నమోదయ్యాయని తెలిపారు. ఈ గణన లెక్కలను వక్రీకరిస్తే మళ్లీ వందేళ్లైనా రిజర్వేషన్ల వ్యవస్థను సరిచేయడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా రిజర్వేషన్ బిల్లులను రాష్ట్రపతి ఐదు నెలలుగా ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న గౌడ్‌కి సరైన గుర్తింపు రావాల్సిన సమయం ఇదేనని, ఖిలాషాపూర్ కోటను గత ప్రభుత్వం మైనింగ్ కోసం లీజుకు ఇచ్చిందని సీఎం రేవంత్ విమర్శించారు.

అమీర్‌పేట్-మైత్రి వనం వరద సమస్యలపై హైడ్రా కమిషనర్ రంగంలోకి

నగరంలో వరద సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం అమీర్‌పేట్, మైత్రి వనం పరిసర ప్రాంతాలను పర్యటించారు. మైత్రి వనం వద్ద వరద ఉధృతి తగ్గించేందుకు చేపట్టవలసిన చర్యలపై ఆయన ఆధ్వర్యంలోనే పరిశీలనలు జరిపారు. ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం, తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ జూబ్లీ హిల్స్, వెంకటగిరి, రహ్మత్ నగర్, యూసఫ్‌గూడ ప్రాంతాల నుండి కృష్ణకాంత్ పార్క్ మీదుగా పారే వరద కాలువను కూడా పరిశీలించారు. పైప్రాంతాల నుండి వచ్చే వరద నీటిని కృష్ణకాంత్ పార్క్‌లోని చెరువులోకి మళ్లిస్తే, కొంత మేరకు వరద ఉధృతిని నియంత్రించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 

Exit mobile version