Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

విదేశాల్లో మగ్గుతున్న నా కొడుకులను రక్షించాలని మహిళ విజ్ఞప్తి.. వెంటనే స్పందించిన పవన్‌ కల్యాణ్‌..

సమస్య అంటూ తన దగ్గరకు వచ్చినా.. సాయం అంటూ విజ్ఞప్తి చేసినా.. వెంటనే స్పందించేవాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరు.. ఇప్పుడు, మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఓ మహిళ విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల దృష్టికి తీసుకెళ్లారు..

గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఎందుకు చేర్చలేదు.. ఈసీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే విధంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. జూన్ 25న బీహార్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం తర్వాతే రాజకీయ దుమారం చెలరేగింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల సంఘం వ్యవహారిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణకు పూనుకుంది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పది పిటిషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గురువారం ధర్మాసనం విచారణ చేపట్టగా.. ఈ సందర్భంగా పోల్ కసరత్తు సమయాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆధార్ కార్డును మినహాయించడంపై ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఈసీ తప్పనిసరి చేసిన 11 పత్రాల జాబితాలో ఆధార్ కార్డు ఎందుకు లేదనే దానిపై ప్రత్యక్ష సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం నుంచి వివరణ కోరింది. 10 పిటిషన్లను న్యాయమూర్తులు సుధాంషు ధులియా, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది.

బెట్టింగ్‌ యాప్స్‌లో సెలబ్రిటీలపై కేసు.. బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా..?

బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు వేశా.. న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, ఈ కేసులో బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా? అని ప్రశ్నించారు. బాలకృష్ణ పైన కేసు ఎందుకు నమోదు చెయ్యరు?.. కూటమి ఎమ్మెల్యేలపై కేసు పెట్టలేదా? అని అడిగారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేస్తుంది అని ఆరోపించారు. అలాగే, సిగాచి ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓనర్లను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు?.. ఇదే యూరోపియన్ దేశాల్లో జరిగి ఉంటే కఠిన చర్యలు ఉండేవి, ఇండియాలో మాత్రం బెయిల్స్ వస్తాయని కేఏ పాల్ సెటైర్లు వేశారు.

కెనడాలో విమాన ప్రమాదం.. కేరళకు చెందిన పైలట్ మృతి

కెనడాలో రెండు శిక్షణా విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతుల్లో కేరళకు చెందిన విద్యార్థి పైలట్ శ్రీహరి సుకేష్(21) కాగా.. అతని క్లాస్‌మేట్ కెనడియన్ పౌరుడు సవన్నామే రోయెస్(20)గా గుర్తించారు.మంగళవారం కెనడాలో జరిగిన రెండు శిక్షణ విమానాల ప్రమాదంలో మరణించిన ఇద్దరు వ్యక్తుల్లో భారత సంతతికి చెందిన విద్యార్థి పైలట్ కూడా ఉన్నారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ బుధవారం తెలిపారు. కెనడాలోని దక్షిణ మానిటోబాలోని స్టెయిన్‌బాచ్ సౌత్ విమానాశ్రయానికి సమీపంలో హార్వ్స్ ఎయిర్ పైలట్ స్కూల్ ఉపయోగించే రన్‌వే నుంచి 400 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.

ఎస్సైజ్ శాఖ కల్లు కాంపౌండ్ వారితో కుమ్మకైంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హాట్ కామెంట్స్..!

సైకోట్రోపిక్ కల్లు ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఓ కల్లు కాంపౌండ్‌ లో కల్లులో సైకో ట్రోఫిక్ సబ్‌స్టెన్స్ కలపడం వల్ల అనధికారికంగా 6 మంది మృతి చెందారని, పలువురి ఆరోగ్యం విషమించిందని ఆయన తెలిపారు. రెండు సీసాల కల్లు తాగినవారిలో కిడ్నీలు దెబ్బతిన్నాయనడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఒకే ఆసుపత్రిలో 31 మందికి చికిత్స జరుగుతోందని, బాధితుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రామచందర్ రావు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ సవాల్‌ను స్వీకరించిన లోకేష్.. నేను రెడీ..!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించారు మంత్రి నారా లోకేష్‌.. నేను రెడీ అని ప్రకటించారు.. మెగా పేరెంట్-టీచర్స్‌ మీటింగ్‌ సందర్భంగా.. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ఆయన.. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు.. చదువు, మార్కులు, ఇతర అంశాలపై చర్చించారు.. ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ విసిరిన ఆ సవాల్‌ ఏంటి? లోకేష్‌ ఎందుకు స్వీకరించారనే విషయాల్లోకి వెళ్తే..

‘బాహుబలి’ రీరిలీజ్‌పై జక్కన్న గ్రాండ్ అప్డేట్..

ప్రభాస్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో రూపొందిన ‘బాహుబ‌లి’ మూవీ రెండు భాగాలుగా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబ‌ట్టింది. ఈ సినిమాల క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. బాహుబ‌లి సినిమాల రీరిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని ప‌లు సంద‌ర్భాల‌లో ఫ్యాన్స్ త‌మ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అయితే భారత సినీ చరిత్రలో ఓ అద్భుతం, ఓ మైలురాయి‌గా నిలిచిన చిత్రం ‘బాహుబలి’ నేటికి పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సోషల్ మీడియాలో భావోద్వేగ భరితంగా స్పందించారు.. “బాహుబలి.. ఎన్నో ప్రయాణాలకు నాంది. మరెన్నో మధుర జ్ఞాపకాలు. ఎంతో మందికి స్ఫూర్తి” అని ఆయన పేర్కొన్నారు.. అలాగే ఫ్యాన్స్ గుడ్ న్యూస్ కూడా తెలిపారు ఏంటీ అంటే..

రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే భారత్‌కు 500 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ హెచ్చరికలు

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మిత్ర దేశాలను కూడా శత్రు దేశాలుగా మార్చుకుంటున్నారు. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేకపోయింది. నిత్యం అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. ఈ విషయం ట్రంప్‌కు రుచించడం లేదు. దీంతో రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యాను కంట్రోల్‌లోకి తేవాలంటే దాని మిత్ర దేశాలపై 500 శాతం సుంకాలు విధించాలని కేబినెట్ సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

నయనతార విడాకుల వార్తలు.. షాకింగ్ ఫొటో వదిలిందిగా!

ఎంతోమందితో రిలేషన్‌లో ఉండి, తర్వాత బ్రేకప్ చెప్పిన నయనతార, చివరికి విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడి, ఆయన్నే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే, ఈ మధ్యకాలంలో వారి రిలేషన్ గురించి, విడాకులకు హింట్ ఇచ్చేలా నయనతార ఒక పోస్ట్ పెట్టడంతో, ఇంకేముంది, “నయనతార ఇతనితో కూడా సరిగ్గా లేదు, విడాకులు తీసుకుంటుంది” అంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు నయనతార కానీ, ఆమె టీమ్ కానీ, ల లేదా విగ్నేష్ శివన్ కానీ స్పందించలేదు.

Exit mobile version