Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మరో విధ్వంసానికి ముహూర్తం పెట్టిన బాలయ్య – గోపీచంద్ మలినేని

వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు నిర్మించనున్నారు.NBK111 టైటిల్ తో తెరకెక్కుస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సినిమా రెండు వేరు వేరు కాలాలకు చెందిన స్టోరీ అని చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఒకరకంగా టైమ్ ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని బాలయ్యను మునుపెన్నడు చూడని విధంగా పవర్ఫుల్ గా ఉండబోతుందట అందుకు తగ్గట్టే దర్శకుడు కొన్ని రోజుల క్రితం మొరాకోలో అనౌన్స్‌మెంట్ వీడియో తీశాడు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని ప్రకటన రాబోతుంది. టెక్నికల్ టీమ్ విషయంలోను మేకర్స్ ఎక్కడ కంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమాకు సీనిమాటోగ్రాఫర్ గా కాంతార కు పని చేసిన అర్వింద్ కశ్యప్ ను తీసుకున్నారు. ఇక సంగీత దర్శకుడిగా బాలయ్య ఆస్థాన వాయిద్యుడు తమన్ వర్క్ చేయబోతున్నారు. బాలయ్య కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ వర్క్ ఫిల్మ్ అవుతుందని ఈ చిత్ర కథ తెలిసిన కొందరు టాలీవుడ్ సిర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

పాక్ F-16, J-17 ఫైటర్ జెట్‌‌లు ధ్వంసం చేశాం.. 300 కి.మీ లోపల దాడులు చేశాం..

ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌పై భారత్ సైన్యం చేసిన దాడి గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా తయారీ F-16, చైనీస్ J-17లను భారత్ కూల్చివేసిందని శుక్రవారం వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పారు. పాకిస్తాన్ తన పౌరుల్ని తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, భారత్ జెట్లను నాశనం చేశామనే పాక్ వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. పాకిస్తాన్ స్వయంగా భారత్‌ను కాల్పుల విరమణ కోరిందని చెప్పారు. పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం భారత సైనిక శక్తిని, ఖచ్చితత్వానికి నిదర్శనమని చెప్పారు. ‘‘ ఆపరేషన్ సిందూర్‌లో, అమాయక ప్రజలను చంపినందుకు ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోవడం మీరు చూశారు. మేము మా లక్ష్యాన్ని సాధించిన విషయాన్ని ప్రపంచం చూసింది. మేము పాకిస్తాన్ లోపల 300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించాము. ఆపై వారు (పాకిస్తాన్) కాల్పుల విరమణను కోరారు’’ అని ఏపీ సింగ్ చెప్పారు.

లక్కీ హీరోయిన్‌ చేతిలో 8 సినిమాలు..అన్ని బడా సినిమాలే

మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్‌ భీమ్లా నాయక్‌తో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటికే మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని క్రేజ్‌ ‘భీమ్లానాయక్‌ ‘ తీసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో బిజీ కావడమే కాదు ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్‌ అన్న పేరు తెచ్చుకుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వచ్చిన సార్‌ సూపర్ హిట్ కాగా నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసార, సాయి దుర్గ తేజ్ తో చేసిన విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్స్‌ గా నిలి లక్కీ హీరోయిన్‌ అయిపోయింది సంయుక్త.

చంద్రబాబు, జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు తీవ్ర అలజడి రేపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఈ- మెయిల్స్ వచ్చాయి. ‘హోలి ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్’ పేరుతో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఆ మెసేజ్ లో తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు.. ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి దాన్ని అడుగడుగునా చెక్ చేస్తున్నారు.

కర్ణాటకలో దారుణం.. 12 ఏళ్ల కుమార్తెను చంపి తల్లి ఏం చేసిందంటే..!

కర్ణాటకలో ఓ తల్లి ఘాతుకానికి పాల్పడింది. నవమాసాలు మోసి కని పెంచిన కన్నబిడ్డను అత్యంత దారుణంగా హతమార్చింది. అనంతరం తల్లి కూడా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘోరం శివమొగ్గలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని శివమొగ్గలోని ప్రభుత్వాస్పత్రి నర్సుల క్వార్టర్స్‌లో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. కుటుంబ యజమాని ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. రాత్రి యథావిధిగా భర్త రాత్రి షిఫ్ట్‌కు వెళ్లిపోయాడు. ఇంట్లో భార్య శృతి (38), కుమార్తె పూర్విక (12) ఉన్నారు. భర్త నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికొచ్చేసరికి తలుపులు వేసి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరు మృతదేహాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా భర్త కుప్పకూలిపోయాడు. కన్నీరుమున్నీరుగా విలపించాడు.

కరూర్ తొక్కిసలాట కేసు.. కోర్టులో విజయ్ పార్టీకి షాక్…

కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ నిరాకరించింది. కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున, ప్రస్తుతానికి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. సభలు, ర్యాలీలో నిర్వహించే సమయంలో కనీసం నీళ్ళు కూడా ఎందుకు ఇవ్వలేదని టీవీకే పార్టీని కోర్టు ప్రశ్నించింది. కనీస అవసరాలైన నీళ్ళు, ఆహారం, టాయిలెట్లు, పార్కింగ్ ఉండేలా ఎందుకు చూసుకోలేదంటూ ప్రశ్నించింది. రోడ్డు సమావేశం ఎర్పాటు ఎందుకు అనుమతి ఇచ్చారని పోలీసులను అడిగింది. బాధితులకు పరిహారం పెంపుపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలన్న ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు.. టీవీకే నేతల ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయణ కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాల‌యంలో మలేషియా ప్రతినిధులతో మంత్రి నారాయ‌ణ‌, సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ కన్నబాబు సమావేశం అయ్యారు. ఈ భేటీలో మ‌లేషియాలోని సెలాంగార్ స్టేట్ ఎక్స్ కో మంత్రి ప‌ప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గ‌న‌బ‌తిరావ్, మ‌లేషియా- ఆంధ్రా బిజినెస్ చాంబ‌ర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న నిర్మాణ ప‌నుల పురోగ‌తిని క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించిన త‌ర్వాత ఈ మీటింగ్ కొనసాగుతుంది. అమ‌రావ‌తి నిర్మాణం గురించి మ‌లేషియా బృందానికి మంత్రి నారాయణ పలు అంశాలను వివ‌రించారు.

అన్ని పార్టీల నాయకులు ఒకే దగ్గర కలుసుకునే వేదిక అలయ్ బలయ్

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా సందర్భంగా నిర్వహించే “అలయ్ బలయ్” కార్యక్రమ ప్రాధాన్యతను గుర్తుచేశారు. విభేదాలు ఉన్న నాయకులు కూడా ఒకే వేదికపై కలుసుకునే ప్రత్యేక వేదిక ఇదేనని ఆయన పేర్కొన్నారు. “దసరా రోజున మనం ఒకరిని ఒకరు కలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం. అదే తరహాలో అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా రాజకీయంగా విభేదించే వ్యక్తులు కూడా ఒకే వేదికపై కలుస్తారు,” అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దత్తాత్రేయ గారు అలయ్ బలయ్ ద్వారా అందరినీ కలిపారని ఆయన గుర్తుచేశారు. మునుపు దేవాలయాలకు వృద్ధులు మాత్రమే వెళ్తారని, కానీ ఇప్పుడు పాఠశాల విద్యార్థులు కూడా ఆసక్తిగా దేవాలయాలకు వెళ్ళి చదువుకు బయలుదేరుతున్నారని చెప్పారు. సనాతన ధర్మంపై యువతకు ఆసక్తి పెరగడం సంతోషకరమని ఆయన అన్నారు.

అహ్మదాబాద్ టెస్టులో ధ్రువ్ జురెల్ సెంచరీ.. శతకానికి చేరువలో జడేజా

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత్ దూకుడుగా ఆడుతుంది. యువ బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన సెంచరీ చేయడంతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శతకానికి చేరువలో ఉన్నాడు. వీరిద్దరూ టీమిండియా ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. రెండో రోజు కొనసాగుతున్న టీమిండియా బ్యాటింగ్ లో 4 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసి, 245 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే, లంచ్ బ్రేక్ తర్వాత తొలి ఓవర్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ చేసి అవుట్ కావడంతో విండీస్ జట్టులో ఆశలు చిగురించాయి. రాహుల్ పెవిలియన్ చేరినప్పటికీ, జురెల్, జడేజా క్రీజులో నిలిచి అద్భుతమైన భాగస్వామ్యం జోడించారు. ఇక, జురెల్ తన క్లాస్ షాట్లతో ఆకట్టుకోగా.. జడ్డూ భాయ్ మాత్రం స్పిన్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. స్పిన్ బౌలింగ్ లోనే నాలుగు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. కాగా, రిషభ్ పంత్ కి గాయం కావడంతో తుద్ది జట్టులోకి వచ్చిన జురెల్ తనలోని సత్తాను చాటి శతకం బాదేశాడు.

 

Exit mobile version