Site icon NTV Telugu

Balkampet Yellamma Temple: నేటి నుంచి బల్కం అమ్మవారి కల్యాణ మహోత్సవాలు

Balkam Yellamma

Balkam Yellamma

హైద‌రాబాద్ లో రేపు (5)న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. నిన్న (ఆదివారం) వివిధ శాఖల అధికారులతో కలిసి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రేపు (5)న కల్యాణం.. ఎల్లుండి (6)న రథోత్సవం జరగనుంది. ఈనేప‌థ్యంలో.. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు ఎల్లమ్మ కల్యాణ వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. అమ్మ‌వారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

read also: Pawan Kalyan: ప్రధాని మోదీ పర్యటనకు పవన్ కళ్యాణ్ దూరం

ఎల్ల‌మ్మ‌ కల్యాణాన్ని తిలకించేందుకు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమ్మవారి కల్యాణాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కాగా.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక కవర్లు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎల్ల‌మ్మ అమ్మ‌వారి క‌ల్యాణానికి జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ, జిల్లా వైద్యాధికారి వెంకటి, వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌, జీఎం హరిశంకర్‌, ఐఅండ్‌పీఆర్‌ సీఐఈవో రాధాకృష్ణ, సీఐ సైదులు, ఈవో అన్నపూర్ణ, చైర్మన్‌ సాయిబాబాగౌడ్‌, ధర్మకర్తలు పాల్గొననున్నార‌ని తెలిపారు.

ఎల్లమ్మ ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు క్యూలైన్ల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. బందోబస్తు నిమిత్తం 500 మంది సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. కాగా.. అమీర్‌పేట మాజీ కార్పొరేటర్‌ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా తయారు చేయించారు.

Talasani Srinivas: లా అండ్ ఆర్డర్ లేకపోతే.. మీ వాళ్ళు తిరిగే వాళ్ళా?

Exit mobile version