NTV Telugu Site icon

Telangana Rains: చల్లబడిన వాతావరణం.. హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం..

Telangana Rains

Telangana Rains

Telangana Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అక్కడక్కడ భారీ వానలు పడుతున్నాయి. చిక్కడపల్లి, హిమాయత్ నగర్, అబిడ్స్, బర్కత్ పురా, కార్వాన్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట, బంజారాహిల్స్, రాజేంద్రనగర్‌, తుర్కయంజాల్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌, శంషాబాద్‌, ఆదిబట్ల, చార్మినార్‌, నాంపల్లి, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, కాచిగూడ, జల్‌పల్లిలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వర్షం పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన కారణంగా నాళాల నిండి నుంచి నీరు పైకి రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది. ఈ నెల 20 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లవద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Read also: Karnataka: ముస్లిం మహిళకు రైడ్ ఇవ్వడంతో.. యువకుడిపై దాడి.. చివరకి..

ఇక నిన్న సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండలో వర్షం కురిసింది. మరోవైపు ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. అలాగే కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది.

Wife Killed Husband: తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. మామతో కలిసి భర్తను చంపిన భార్య