NTV Telugu Site icon

IIIT Student: ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు.. ఏడాది వ్యవధిలో ముగ్గురు..!

Iiit Student Dead

Iiit Student Dead

IIIT Student: ఐఐటీ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఏడాది వ్యవధిలో ముగ్గురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు తనువుచాలిస్తున్నారు. పరీక్షల్లో ఫెయిల్ కాగానే స్టూడెంట్స్ చావే శరణ్యం అనుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకే విద్యార్థులు డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. గతేడాది ఆగస్టు 31న క్యాంపస్ లో మంచానికి ఉరి వేసుకుని ఏపీ లోని నంద్యాల జిల్లా విద్యార్థి రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్ లోని జోధ్ పూర్ కి చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్ కపూర్ సంగారెడ్డిలో ఓ లాడ్జిపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఈ నెల 17న క్యాంపస్ నుంచి బయటికి వెళ్లి వైజాగ్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ శవమై తేలాడు. విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారు. పిల్లలు మంచిగా చదువుకుని, ఉద్యోగంలో స్థిరపడి చేదోడు వాదోడుగా వుండాల్సిన కన్న పిల్లలు ఇలా సవాలై తమ ఇంటికి చేరుతుండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఐఐటీలో అసలు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. పిల్లల్ని దూరం చేసుకోవాలంటే త్రిపుల్ ఐటీకి పంపాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీ

Read also: IIIT Student: ఐఐటీ విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతం.. విశాఖ ఆర్కే బీచ్ లో శవంగా తేలాడు..!

ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్ కేసు విషాదంగా మారింది. విశాఖలోని ఆర్.కే బీచ్ లో కార్తీక్ సవమై కనిపించడంతో సంచలనంగా మారింది. ఈ నెల 17న క్యాంపస్ నుంచి బైటికి వెళ్లిన కార్తీక్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ లొకేషన్‌ను పరిశీలించారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటలకు కార్తీక్ కళాశాల హాస్టల్ నుంచి బయటకు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ తర్వాత క్యాబ్ ఎక్కి 9 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకుని లోకల్ ట్రైన్ లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకున్నాడు. 18వ తేదీ ఉదయం 6 గంటలకు జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కి వైజాగ్ వెళ్లారు. 19వ తేదీ ఉదయం నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు సీసీటీవీ విజువల్స్ లో తేలింది. ఆరోజే విశాఖకు కార్తీక్ తల్లిదండ్రులు, సంగారెడ్డి పోలీసులు బయలు దేరి వెళ్ళారు. 20 నాడు మూడు గుర్తు తెలియని డెడ్ బాడీ లు మార్చురీలో ఉన్నాయని చెప్పిన విశాఖ పోలీసులు. భయంతో డెడ్ బాడీని చూడటానికి ధైర్యం చాలక.. కార్తీక్ తల్లిదండ్రులు బంధువులను పంపారు. ఆరు రోజులైనా కార్తిక్ ఆచూకీ లభించకపోవడంతో నిన్న తల్లిదండ్రులు మార్చురీకి వెళ్ళారు. 24న (నిన్న) రాత్రి కార్తీక్ మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తుపట్టి బోరున ఏడ్చారు. కన్నపేరు శవమై కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
IIIT Student: ఐఐటీ విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతం.. విశాఖ ఆర్కే బీచ్ లో శవంగా తేలాడు..!