NTV Telugu Site icon

Missing girls: మిస్టరీగానే బాలికల మిస్సింగ్ కేసు.. ఇంకా దొరకని ముగ్గురి ఆచూకీ

Missing Girls

Missing Girls

Missing girls: హైదరాబాద్ తిరుమలగిరిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. 24 గంటలు గడిచినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పిల్లలను త్వరగా కనిపెట్టి క్షేమంగా ఇంటికి చేర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు.

Read also: Theft in the temple: ఆలయంలోనే కన్నం వేద్దామనుకున్నాడు.. ఇంతలోనే..

ఏం జరిగింది?

హైదరాబాద్ లోని తిరుమలగిరికి చెందిన పరిమలా అనే బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్థానికంగా ఉన్న స్నేహితులు హసీనా, స్వప్నతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ముగ్గురూ ప్రెండ్స్‌ కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నిన్న ఉదయం వెళ్లిన బాలికలు నేటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఎక్కడికి వెళ్లారని ఒకరినొకరు సంప్రదించుకున్నారు తల్లిదండ్రులు. అయితే వారిరువులు రాలేదు అనడంతో.. కుటుంబసభ్యులు ముగ్గురికి ఫోన్‌ చేశారు. ముగ్గురి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారికి కూడా సంప్రదించడంతో.. పిల్లలు రాలేదని వారి ఎలాంటి ఆచూకీ లబించకపోవడంతో ఆందోళన ఎక్కువైంది. తల్లిదండ్రులు రాత్రంతా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఏం జరిగింది అనే విషయమంతా పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read also: NTV Effect: యాలాల ఘటనలో హెడ్ మాస్టర్ సహా ముగ్గురిపై వేటు

ఇలాంటి ఘటనే వర్ధన్నపేటలో..

అయితే.. ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన ఇలాంటి ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో చోటుచేసుకుంది. రాత్రి 8వ తరగతి విద్యార్థి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న విషయాన్ని తోటి విద్యార్థులు గమనించారు. వెంటనే విద్యార్థిని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను తీసుకున్న వార్డెన్‌కు సమాచారం అందించారు. అనంతరం వార్డెన్ ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం టిఫిన్ చేస్తుండగా 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు, 9వ తరగతి చదువుతున్న మరో బాలిక కనిపించకుండా పోయింది. తమ గదిలో ఉంటున్న విద్యార్థులను విచారించగా.. ఉదయం బయటకు వెళ్లినట్లు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి హడావుడిగా హాస్టల్‌కు చేరుకున్నారు. బంధువులు, స్నేహితులతో తనిఖీలు చేయగా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్డెన్ స్వరూప తెలిపారు.

కాగా.. అమ్మాయిల మిస్సింగ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బాలికలు అదృష్యం కావడంతో.. తీవ్ర ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. పోలీసులు అన్నత అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అమ్మాయిన అదృష్యం ఘటనలు పోలీసులకు సవాల్‌ గా మారింది. మరి దీనిపై పోలీసులు ఎలా సందిస్తారు. బాలికల ఆచూకీ కోసం సీసీ ఫోటేజీలను పరిశీలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి బాలికల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అమ్మాయిల ఆచూకీ ఇంకా మిస్టరీగా మారడం నగరంలో కలకలం రేపుతుంది.
Palmyra Fruit: తాటి ముంజల మాజాకా.. మతిపోగొట్టే ప్రయోజనాలు