MLA Rajasingh: తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. ఆయనతో గంటపాటు చర్చలు జరిపారు. హరీశ్ రావును హాస్పిటల్ గురించి కలిశానని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ సస్పెన్షన్ ఎత్తేయక పోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బీజేపీ పార్టీలో మాత్రమే బతుకుతాను, బీజేపీ పార్టీలోనే చనిపోతానని.. వేరే పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. హరీశ్ రావు ను హాస్పిటల్ గురించి కలిశానని క్లారిటీ ఇచ్చారు. నిన్న మంత్రి హరీష్ రావుకు కలవాలని మెసేజ్ పెట్టానని అన్నారు. దీంతో స్పందించిన మంత్రి హరీష్ రావు రమ్మంటే వెళ్లానని క్లారిటీ ఇచ్చారు. ఇదే విషయంలో గతంలో పనిచేసిన హెల్త్ మినిస్టర్ లను కూడా కలిశానని గుర్తు చేశారు. నేను బీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నుంచి బయటకు వెళ్లేదే లేదని తేల్చి చెప్పారు.
Read also: Virat Kohli Record: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. టాప్ 5 లిస్టులోకి!
ఇక మరోవైపు రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీతో బంధం తెగిపోయింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బండి సంజయ్ హైకమాండ్‌కు పలుమార్లు లేఖలు రాసినా పార్టీ నేతల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మరోవైపు ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డితో కూడా రాజాసింగ్ కు విభేదాలున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ తో రాజాసింగ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే హరీశ్‌రావును కలిశానని రాజా సింగ్ అన్నారు. ఇతర అంశాలపై తాము చర్చించలేదని చెప్పారు. అంతేకాకుండా బీజేపీ సస్పెన్షన్ ఎత్తేయక పోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తప్పా పార్టీ మారే సమస్య లేదని స్పష్టం చేశారు రాజాసింగ్. మరి దీనిపై బీజేపీ రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారా? లేదా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Movie Ticket: సినిమా టికెట్‌తో పాటే స్నాక్స్.. జేబుకు చిల్లు పడే ఛాన్స్..!
