బిగ్ బాస్ బ్యూటీ అయిన నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు అందరికి బాగా తెలుసు. నటన పరంగా కూడా ఎంతగానో మెప్పించింది.తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో కూడా ఆమె నటించింది. గతం లో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. గతంలో తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.గత ఏడాది పంచతంత్ర కథలు అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు బాగానే మెప్పించింది. రీసెంట్ గా భాగ్ సాలే సినిమాలో మంచి క్యారెక్టర్ చేసిన నందిని రాయ్, ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం కెరీర్ ని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్న నందిని రాయ్ ఎప్పుడూ చాలా ఫిట్ గా ఉంటుంది.
గంటలు తరబడి వర్క్ ఔట్ చేస్తూ మంచి ఫిజిక్ ని మైంటైన్ చేస్తోంది. తన వర్కౌట్ సీక్రెట్స్ ని నందినీ రాయ్ ‘ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్’ ఆడియన్స్ తో స్పెషల్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. సింధీ అమ్మాయి అయిన నందిని రాయ్, కడుపు మాడ్చుకొని జిమ్ చేయడం కన్నా ప్రశాంతంగా తిని, దాని క్యాలోరీస్ బర్న్ చేయడం ఇంపార్టెంట్ అని ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పింది. స్వీట్స్ లేకపోతే అసలు ఉండలేను అనే సీక్రెట్ రివీల్ చేసిన నందిని రాయ్… బ్యాక్ లెస్ డ్రెస్ వేసినప్పుడు, సారీ కట్టినప్పుడు అందంగా కనిపించడానికి ‘ల్యాట్ ఎగ్జర్సైజ్’ కూడా చేసి చూపించింది. తనది వాటర్ బాడీ కావడంతో, ఎప్పటికప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటానని చెప్పిన నందిని రాయ్… ట్రైనర్ లేకుండా యుట్యూబ్ వీడియోలు చూసి జిమ్ చెయ్యొద్దు అని సలహా ఇచ్చింది. ఇక భాగ్ సాలే విషయానికి వస్తే తన పోర్షన్స్ చిలుకూరు దగ్గర ఒక విలేజ్ షూట్ చేసారని, చాలా సరదాగా సాగిపోయిందని చెప్పుకొచ్చింది.
Watch Also: