NTV Telugu Site icon

Revanth Reddy: ఇన్నాళ్లు సీఎంగా చూశారు.. ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్‌ గా నేనేంటో చూస్తారు..!

Cm Revanthreddy

Cm Revanthreddy

Revanth Reddy:ఇన్నాళ్లు సీఎం గా చూశారూ.. ఇవాల్టి నుండి పీసీసీ చీఫ్ గా నేనేం చేస్తానో చుస్తారు అంటూ సవాల్ చేశారు. పీసీసీ చీఫ్ గా పని మొదలు పెట్టిన.. గంటలో మీకు సమాచారం వస్తుందని హెచ్చరించారు. పేపర్లు అమ్ముకున్నప్పుడు మాకేం సంబంధం అన్నాడు.. ఉద్యోగాలు ఇస్తే.. మేమే ఇచ్చాం అంటున్నాడు హరీష్..దూలం లెక్క పెరగడం కాదు.. దూడకు ఉన్నంత బుద్ది అయినా ఉండాలని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై ఈటెల విచారణకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. చిల్లర మల్లరా ఆరోపణలుతో సరికాదన్నారు. మీ మోడీ నే కదా ప్రభుత్వంలో ఉన్నది.. విచారణ చేయించండన్నారు. మాకు ఫోన్ లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆర్ఎస్ మీద నాకు గౌరవం ఉందని అన్నారు. ఉద్యోగంలో ఉంటే ప్రవీణ్ డీజీపీ అయ్యేవారు… టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రవీణ్ కు ఆఫర్ చేశా.. కానీ ఆయన ఒప్పుకోలేదన్నారు. ఆయన కేసీఆర్ తో చేరుతారని భావించడం లేదని అన్నారు. కేసీఆర్ తో చేరితే సమాధానం చెప్పుకోవాల్సింది ఆయనే అన్నారు. కాసిం రిజీవి పాత్ర ప్రభాకర్ రావు పోషించారని తెలిపారు. రైతు భరోసా పై ఆందోలన వద్దన్నారు. గుట్టలు.. రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమన్నారు.

Read also: Revanth Reddy: కేసీఆర్ గంజాయి మొక్కలు నాటారు.. వాటిని పీకి పడేస్తా..

కాళేశ్వరం పై.. నిపుణులు సలహా మేరకు చర్యలు ఉంటాయన్నారు. మేము 80 వేల పుస్తకాలు చదవలేదన్నారు. పదవి పోవడమే వాళ్లకు పెద్ద శిక్ష అన్నారు. అమర వీరుల స్థూపం దగ్గర రాళ్లతో కొట్టే సూచన ఏదైనా సూచన చేస్తారా..? అని ప్రశ్నించారు. అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. అధికారులు తప్పులు చేస్తే.. వాటిపై విచారణ ఉంటదన్నారు. అధికారుల అందరిపై కేసులు పెట్టి.. ఇబ్బంది పెట్టమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ ఊపండుకుంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఒడిదుడుకులు ఉంటాయన్నారు. ఆ వ్యాపారం చేసే వాళ్లకు తెలుసన్నారు. కొందరినే ప్రోత్సాహకాలు ఉండవన్నారు. గత సర్కార్ లో .. కొందరూ టి.పాస్, బి.పాస్ లో కనీసం దరకస్తూ చేసుకోలేదన్నారు. ఆదాయం పెంచుతాం.. పేదలకు పంచుతామన్నారు. ఇదే మా ప్రభుత్వం విధానమన్నారు. గేట్లు ఓపెన్ చేశా.. ఒక్కటి ఇవాళ చేశా అన్నారు. అవతల ఖాళీ అయితే.. అటో మేటిక్ గా క్లోస్ అవుతోందని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం పనికి.. పార్టీ పనికి లింక్ పెట్టొద్దని హెచ్చారించారు. అన్ని పార్టీల నాయకులు వస్తారు.. ఎంఐఎం వాళ్ళు అధికారిక కార్యక్రమాలకి వచ్చారని తెలిపారు. రిటైర్డ్ అధికారుల జాబితా తెచ్చినం..అవసరం లేని వాళ్ళను తొలగిస్తున్నామన్నారు. వచ్చే మూడు నెలల్లో స్పీడ్ చేస్తాం.. సాధించింది గొప్ప విషయమన్నారు. భవిష్యత్తు ఎంటన్నది ఊహించ లేమని తెలిపారు.
Lok Sabha Elections 2024 : కేరళ, తమిళనాడు ఎన్నికల తేదీని మార్చాలని ముస్లిం సంఘాల డిమాండ్