Site icon NTV Telugu

బండి సంజయ్‌ అంటే ప్రభుత్వానికి భయం: తరుణ్‌చుగ్‌

దీక్షకు దిగిన సంజయ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం.. ఆ తర్వాత జేపీ నడ్డా రావడం .. బండి విడుదల అన్ని చకచక జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై రెండు పార్టీలు ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యాఆరోపణలు చేసుకుంటూ తెలంగాణ రాజకీయాన్ని రణరంగంగా మార్చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ స్వాగత సభ అనంతరం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ మాట్లాడారు.

Read Also: కేసీఆర్ నిన్ను వదిలిపెట్టం.. శాశ్వతంగా జైలుకే..!

బండి సంజయ్ అంటే ఈ ప్రభుత్వానికి భయమని తరుణ్‌ చుగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరీంనగర్‌ బీజేపీ కార్యాలయాన్ని మరో జలియన్‌వాలాబాగ్‌ చేశారని ఆరోపించారు. కరీంనగర్ కమిషనర్ జనరల్ డయ్యర్‌లా ప్రవర్తించాడు. నిన్ను వదలను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపల హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది ఉన్నాడని డోర్ కట్ చేశావా..? అంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రాజరిక పాలన అంతం అయ్యే వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు. టైగర్ బతికే ఉంది, వాపస్ వచ్చింది.. బీజేపీలోని ప్రతి కార్యకర్త ఒక టైగర్‌ అని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ తరుణ్‌చుగ్‌ విమర్శల దాడికి దిగారు.

Exit mobile version