Theft in the temple: గుడిలో దొంగతనానికి వచ్చాడు. హుండీ పగులగొట్టే పనిలో ప్రపంచాన్నే మరిచిపోయాడు. విషయం గమనించిన ఆలయ వాచ్‌మెన్ అక్కడికి వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. వాచ్‌మెన్ ఆ వ్యక్తిని బలంగా నెట్టడంతో, దొంగ తల గోడకు తగిలి అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆ దొంగ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Vikarabad incident: యాలాల ఘటనపై ఎన్టీవీ ఎఫెక్ట్.. హెడ్మాస్టర్ సహా మరో ఇద్దరు సస్పెండ్
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో రంగయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు గుడిలో దొంగతనానికి వచ్చాడు. నేరుగా హుండీ వద్దకు వెళ్లి పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆశబ్దాన్ని గమనించిన వాచ్‌మెన్ రంగయ్య అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వాచ్‌మెన్, దొంగ మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఎంత చెప్పినా వినకపోవడంతో గుడి బయటికి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలనుకున్నాడు వాచ్‌మెన్. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రంగయ్య ఆ వ్యక్తిని తోసేశాడు.. వెళ్లి గోడకు కొట్టాడు. ఈ క్రమంలో అతడికి తీవ్రగాయాలై కాలి బొటనవేలు రక్తం కారింది. వెంటనే కిందపడిపోయిన దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గమనించిన రంగయ్య వెంటనే పోలీసులకు, ఆలయ అధికారులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో మృతుడి వద్ద నుంచి ఫోన్ లభ్యమైంది. సాక్ష్యాధారాల ఆధారంగా దోపిడీకి పాల్పడిన యువకుడిని 23 ఏళ్ల గంధం రాజుగా పోలీసులు గుర్తించారు. అయితే అతడు కామారెడ్డి జిల్లా ఆరెపల్లికి చెందినవాడని తెలిపారు. వెంటనే రాజు మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Palmyra Fruit: తాటి ముంజల మాజాకా.. మతిపోగొట్టే ప్రయోజనాలు