Site icon NTV Telugu

బండి సంజయ్ దాడి ఘటన.. తెలంగాణ సీఎస్‌, డీజీపీ, అధికారులకు సమన్లు జారీ

బండి సంజయ్‌ చేసిన 317 జీవోను రద్దు చేయాలని చేసిన ఉద్యోగ దీక్షలో పోలీసులు బండి సంజయ్‌ని అరెస్టు చేసిన సంగతి తెల్సిందే.. దీనిపై బండి సంజయ్‌ ప్రవిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సంబంధిత పోలీసు అధికారులకు ప్రివిలేజ్‌ కమిటీ సమన్లు జారీ చేసింది. .బండి సంజయ్ కుమార్ పై పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, డీజీపి మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యానారాయణ సహా బాధ్యులైన ఇతర పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది కమిటీ. ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ సభ్యుడి కార్యాలయంపైన, ఎంపీపైన దాడి చేసిన తీరుపై బండి సంజయ్ సమర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ. ఎంపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి గ్యాస్ కట్టర్లతో, ఇనుప రాడ్లతో గేట్లను ధ్వంసం చేసి బండి సంజయ్‌ను అరెస్టు చేయడంపై ప్రవిలేజ్‌ కమిటీ సీరీయస్‌ అయింది.

Read Also:కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పని చేయాలి: మంత్రి హరీష్‌రావు

బండి సంజయ్ వాదనలు విన్న కొన్ని గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ. రాష్ట్ర హైకోర్టు సైతం తనపై దాడిని, అరెస్టును తీవ్రంగా తప్పుపట్టిన విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ దృష్టికి బండి సంజయ్‌ తీసుకెళ్లారు. తనపై రెండోసారి దాడి జరిగిన విషయాన్ని సైతం ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్‌ వివరించారు. తన పై, ఎంపీ కార్యాలయం పై దాడి చేసిన మరికొందరి పోలీస్ అధికారుల పేర్లను ప్రివిలేజ్ కమిటీకి తెలిపిన బండి సంజయ్. సీఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణతో పాటు, హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరాబాద్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వీ.శ్రీనివాస్‌, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె. శ్రీనివాస రావు, కరీంనగర్‌ ఐ-టౌన్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ చలమల్ల నటేష్‌లకు ప్రివిలేజ్‌ కమిటీ సమన్లు జారీ చేసింది.

Exit mobile version