NTV Telugu Site icon

Gold Seized at Pantangi Toll Plaza: లేడీలు కాదు కిలాడీలు..

Pantangi Toll Plaza

Pantangi Toll Plaza

Gold Seized at Pantangi Toll Plaza: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ రంగంలోకి దిగింది. పంతంగి టోల్‌ గేట్ వద్ద తనికీలు నిర్వహించాగా.. 3.05 కేజీల బంగారం సీజ్ చేసారు అధికారులు. విజయవాడ నుండి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వస్తున్న ఇద్దరు మహిళా ‌ప్రయాణీకుల వద్ద బంగారం గుర్తించారు.

Read also: Elon Musk Mark Charges: ట్విట్టర్ ఖాతాదారులకు షాక్.. వారికి రూ1600 ఛార్జ్?

బంగారాన్ని పేస్ట్ రూపంలో లగేజ్‌ బ్యాగ్‌లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కారుతో పాటు బంగారం సీజ్ చేశారు. మహిళా ప్రయాణీకులతో పాటు డ్రైవర్ ను అదుపులో తీసుకున్నారు. వారిని DRI అధికారులకు అప్పగించారు. ముందుగా లేడీలు పథకం ప్రకారం షార్జా నుండి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించే యత్నం చేశారు. అయితే అక్కడనుంచి తప్పించుకున్నామని లేడీలు భావించారు. పంతంగి టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ.. పోలీసులు వారివద్ద వున్న పేస్టును పరిశీలించగా.. బంగారం వున్నట్లు గమనించారు. దీంతో.. వారిని అదుపులో తీసుకుని కారును బంగారాన్ని సీజ్‌ చేశారు DRI బృందం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Vikarabad Crime: కొండగల్ హైఅలర్ట్.. సూట్ కేస్ లో బాలుడి మృతదేహం