NTV Telugu Site icon

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్.. నిందితుడి అరెస్ట్

Raja Singh

Raja Singh

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఫోన్ కాల్స్ తో బెదిరిస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. రాజాసింగ్ ను కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి మహమ్మద్ వసీంగా గుర్తించారు. మహమ్మద్ వసీం గత పదేళ్లుగా దుబాయిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సమాచారం రావడంతో కాపుకాచి మహమ్మద్ వసీంను అదుపులో తీసుకున్నారు. అతనిపై లుక్ ఔట్ నోటీసు ఉండడంతో హైదరాబాద్ తిరిగి వచ్చిన వసీంను పోలీసులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. వసీం హైదరాబాద్ పాతబస్తీ బార్కస్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతరు రాజా సింగ్ కు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నట్లు గుర్తించారు.

Read also: Yadadri: కోర్టులో ఆస్తి వివాదం.. మూడు రోజులుగా మార్చురీలోనే భర్త మృతదేహం

అయితే ఇతనితో ఎవరైనా కాల్ చేయించారా? లేక రాజాసింగ్ పై ద్వేషంతో ఇలా చేశాడా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజాసింగ్ ను చంపేస్తానని బెదిరించడం, ఇలా ఒక్క నెంబర్ తో కాకుండా వేరే వేరే నెంబర్లతో రాజాసింగ్ ను బెదిరించేవాడు. దీనిపై రాజా సింగ్ తెలంగాణ సీఎం కు లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, సీఎం స్పందించాలని కోరారు. తన ప్రాణానికి ప్రాణహాని ఉందని, త్వరలో నిందితున్ని పట్టుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో అలర్ట్ అయిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్ సహాయంతో ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఆరా తీసారు. ఈ నెంబర్లు మొత్తం దుబాయ నుంచి వస్తున్నాయని గ్రహించారు. దీంతో ఈ నెంబర్లతో ఆరాతీయగా దుబాయ్ నుంచి బెదిరింపునకు పాల్పడిన నెంబర్లు మహమ్మద్ వసీం ఖాతా నుంచే నని గుర్తించారు. అతనిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో అదుపులో తీసుకున్నారు. దీంతో రాజాసింగ్ ను కాల్స్ చేసి బెదిరిస్తున్న వ్యక్తం అరెస్ట్ కావడంతో బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
Chandrababu Naidu: ఏపీ రాజధానిగా అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ..!