PM Modi: తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే అంత పవర్ నాకు వస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే అంత పవర్ నాకు వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే అంత పవర్ నాకు వస్తుంది. తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పసుపు రైతులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పని అయిపోతుంది. పదేళ్లపాటు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్‌ఎస్ ఆటలాడుతోంది. ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మారుస్తోంది.
Read also: PM Modi: మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం..
Also Read
బీఆర్‌ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ ఫైళ్లను పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. మద్యం కుంభకోణంలోనూ బీఆర్‌ఎస్ కమీషన్లు తీసుకుంది. బీఆర్‌ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ నాపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి. కాళేశ్వరంలో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును కుట్రలకు వినియోగిస్తున్నారు. తెలంగాణా డబ్బు ఢిల్లీలోని కుటుంబ పార్టీ నేతలకు చేరుతోంది. దేశంలో జరుగుతున్న అన్ని మోసాలకు కుటుంబ పార్టీలే కారణమన్నారు. శివాజీ మైదాన్‌లో తన పోరాట పటిమకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎన్నో మాటలు అన్నారు. శక్తిని నాశనం చేసేవారికి మరియు శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం జరగబోతోంది. నాకు ప్రతి స్త్రీ శక్తి రూపంగా కనిపిస్తుంది. శక్తిని నాశనం చేయాలన్న రాహుల్ గాంధీ సవాలును నేను స్వీకరిస్తున్నాను.
Read also: Peddireddy Ramachandra Reddy: ఇప్పుడు అధికారంలో ఉన్నాం.. రేపు కూడా రాబోతున్నాం
చంద్రయాన్ విజయవంతం అయిన ప్రదేశానికి శివశక్తి అని పేరు కూడా పెట్టాను. శక్తి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో జూన్ నాలుగో తేదీన తేలిపోనుంది. నేను భారతమాతకు పూజారిని’ అని వ్యాఖ్యానించారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. తెలంగాణ ప్రజలు వికాసిత్ భారత్‌కు ఓటు వేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మల్కాజిగిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్ అంటున్నారు.. 400 పార్. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదలైంది. గడిచిన మూడు రోజుల్లో తెలంగాణకు రెండు సార్లు వచ్చాను. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారతదేశం అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. బీఆర్‌ఎస్‌పై ప్రజల ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యం.
Citadel : సిటాడెల్ వెబ్ సిరీస్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన వరుణ్ ధావన్..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!