Nagoba Jathara: ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతర నేటితో ముగియనుంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఇవాళ ముగియనుంది. పంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో నాగోబా జాతర ఒకటి. ఈనెల 21న ఈజాతరకు మెస్రం వంశీయులు గంగాజలాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని ఆదివాసులంతా జాతరకు వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈజాతర వారం రోజుల పాటు ఇక్కడే ఉండి సంప్రదాయం ప్రకారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఇంద్రవెల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఎడ్ల బండ్లలో వచ్చిన వారు తమ ఎడ్ల బండ్లను తీసుకొని నేడు జాతర ముగియడంతో తమ స్వగ్రామానికి బయలుదేరారు.
Read also: KTR Nizamabad Tour: నేడే నిజామాబాద్‌కు మంత్రి కేటీఆర్.. శంకుస్థాపనలు, బహిరంగ సభ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర ఈనెల జనవరి జాతర ఉత్సవాలు 21 నుంచి 28వ తేది వరకు వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెళ్లి దర్శించుకున్నారు. ఈ నెల 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై.. నాగోబాను దర్శించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండే కాకుండా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. దీంతో కేస్లాపూర్ గ్రామం భక్తులతో కిక్కిరిసింది. జాతరలో భాగంగా భేటింగ్, కొత్త కోడళ్ల పరిచయం, మందగజిలి పూజ, బేతాళ పూజ మొదలైనవి జరుగుతాయి. మేస్రం వంశీయులు జాతర ముగింపు సందర్భంగా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామంలోని బుడుం దేవ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత వారు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లానున్నారు.
Janhvi Kapoor : ముక్కు పుడకతో మైమరిపిస్తున్న జాన్వీ