ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతర నేటితో ముగియనుంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఇవాళ ముగియనుంది. పంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో నాగోబా జాతర ఒకటి. ఈనెల 21న ఈజాతరకు మెస్రం వంశీయులు గంగాజలాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు.
నాగోబా జాతరకు తరలివస్తున్న భక్తజనంతో కేస్లాపూర్ పోటెత్తుతోంది. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. రెండో రోజు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెస్రం వంశీయులు గోవాడ నుంచి ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.