Hyd Boy Murder Mystery: దుర్గానగర్ బాలుడి మర్డర్ మిస్టరీ.. హత్యచేసింది అతనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyd Boy Murder Mystery: హైదరాబాద్‌లోని దుర్గానగర్ ప్రాంతంలో బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడు కనిపించకుండా పోయిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఓ వృద్ధుడిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక వృద్ధుడితో కలిసి బాలుడు వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డైంది. బాలుడి అంత్యక్రియల అనంతరం నిందితుడు ఆ ప్రాంతానికి తిరిగి రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తానే హత్య చేసినట్లు వృద్ధుడు అంగీకరించడంతో వారు షాక్‌కు గురయ్యారు. బాలుడిపై అత్యాచారం చేసి, ఎదురు తిరిగితే చంపేశానని ఒప్పుకున్నాడు.
Read also: Jio New Plan 2024: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్.. అదనపు డేటా, 14 ఓటీటీలు ఫ్రీ!
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
జూబ్లీహిల్స్‌లోని దుర్గానగర్‌లో గత బుధవారం నాలాలో బాలుడు శవమై కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలుడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. 5వ రోడ్డులోని దుర్గాభవానీనగర్ బస్తీలో నివాసముంటున్న ముదావత్ రమేష్, కవిత దంపతుల రెండో కుమారుడు కార్తీక్ అలియాస్ పాండు(10) గత మంగళవారం రాత్రి అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం స్థానికులు వెతకగా పార్కులోని డ్రైనేజీలో శవమై కనిపించాడు. బాలుడిని ఎవరో హత్య చేశారని తల్లి ఆరోపించింది. ఇదే బస్తీకి చెందిన మన్యం నాయక్ (42) గత కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. 15 రోజుల క్రితం బస్తీకి బాలుడిని కలిశాడు. అయితే గతంలో బాలుడి కుటుంబంతో గొడవలు జరిగినట్లు గుర్తించారు.
Read also: MLC Kavitha: ఆ.. జీవోను తక్షణమే వెనక్కి తీసుకోండి.. ఖర్గే కు ఎంఎల్‌సీ కవిత లేఖ
బాలుడు మృతి చెందినప్పటి నుంచి ఫోన్‌లో కూడా నాయక్ అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చింది. బాలుడి అంత్యక్రియల అనంతరం కొండపైకి వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు గత మంగళవారం రాత్రి పార్కులో ఆడుకుంటున్న బాలుడిని తనతో పాటు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలుడు ఎదురు తిరగడంతో గొంతు నులిమి రాయితో తలపై కొట్టి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కుమారుడి ద్వారా పోలీసులు నేరం వివరాలు రాబట్టారు. చిన్నారులపై అత్యాచారం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి భార్య చనిపోయిన తర్వాత ఇంటికి రావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
YCP- TDP Rebel MLAs: టీడీపీ- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. ఈసారి రాకపోతే
- Tags
- Boy
- boy murder
- hyd
- murder
- mystery
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!