Telangana: ఎన్నికలు తేదీ దగ్గరకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ నేతలు సాయశక్తులా కృషి చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి పార్టీతరుపు ప్రతినిధులు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాని సేకరిస్తారు. అయితే నేతలు ఎవరికీ తెలియకుండా నగదు పంపిణీ చెయ్యాలి అనుకుంటుంటే.. ఓటర్లు మాత్రం నేతల గుట్టు రట్టు చేస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా లోని హుజూరాబాద్‌లో ఓ పార్టీ ప్రతినిధి నోటు పుస్తకాల్లో ఓటర్ల పేరును నమోదు చేసుకునేందుకు వచ్చి పేర్లు రాసుకుంటున్న సమయంలో కొందరు ఆ ప్రతినిధి దగ్గరకు వచ్చి.. అక్క ఏంది మా ఇంట్లో ముగ్గురు ఓట్లు ఉంటె మీరు ఇద్దరి పేర్లు మాత్రమే రాసుకున్నారు.. మా చిన్న అమ్మాయి పేరు కూడా రాసుకోండి అని ఒకరు.. మా ఇంట్లో 5 మంది ఉంటె ముగ్గురు పేర్లు రాసున్నారేంటి అని మరొకరు వాగ్వాదానికి దిగారు.
Read also:Telangana Elections : తెలంగాణ ఎన్నికల పరీక్ష పత్రం లీక్
అలానే హైదరాబాద్ ప్రాంతం లోనూ.. మా అపార్ట్మెంట్ లో 24 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే కేవలం 20 ఇల్ల లోని వాళ్ల వివరాలే రాసుకున్నారు. కాగా చివరి అంతస్తులో ఉన్న ఇల్లను వదిలేశారు. ఆ అంతస్తులో నాలుగు ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లలో 15 మంది ఓటర్లం ఉన్నాం. మా పేర్లూ కూడా రాసుకోండి అంటూ ఆ అపార్ట్మెంట్ కి వచ్చిన నేతలతో గొడవకు దిగారు కొందరు ఓటర్లు. కాగా నిజామాబాద్ జిల్లా లోని బాల్కొండ నియోజకవర్గం లోని ఒక గ్రామంలోనూ ఇదే పంచాయితీ. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఓటుకు నోటు ఇవ్వలసిందేనని.. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఆ నోట్ల పంపిణీ చెయ్యాలని ప్రతి పార్టీ తీవ్రంగా సన్నాహాలు చేస్తుంది.