భార్య భర్తల సంబందాలు అనుమానాలు తప్పా అన్యోన్యత కరువుతుంది. కుటుంబంలో కలతలు, ఒకరిపై ఒకరు వాదోప వాదాలు తప్పా సంతోషాలు కనుమరుగవుతున్నాయి. కుటుంబంతో గడిపే రోజులు పోయాయి. ఆనందంగా గడపాల్సిన జీవితాల్లో అనుమానాలకు తావు లేపుతున్నాయి. అలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది.
Read also: Supreme Court: ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరదు..
ఖమ్మం జిల్లాలో వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో సురేష్, సూజాత భార్య భర్తలిద్దరూ పెళ్లైన కొద్దిరోజులు సజావుగా సాగిన వారి కాపురంలో అనుమానాలు తావులేపాయి. భార్యపై భర్త అనుమానంతో రోజూ చిత్రహింసలకు గురిచేసేవాడు. అయినా భరిస్తూ భర్తతోనే తన జీవితం అనుకున్న భార్యను రాను రాను దారుణంగా చిత్రహింసలు మొదలు పెట్టాడు. ఆమెలో సహనం చచ్చిపోయింది. చివరకు సుజాత ఆత్మహత్య చేసుకుందామనుకుంది. తీవ్ర మనస్థాపనికి గురైన భార్య సుజాత 2018లో వృద్దాశ్రమంలో ఉరివేసుకొని సుజాత ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల వలనే సుజాత మృతి చెందిదని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈకేసు పై స్పందించిన సత్తుపల్లి న్యాయస్థానం.. భార్య సుజాత మృతికి కారణం అయిన భర్త సురేష్‌కి మూడేళ్ళ జైల్ శిక్ష ,10 వేల జరిమానా విధించింది. అన్యాయంగా తన భార్య ఆత్మహత్య చేసుకునేలా ఆమెను చిత్రహింసలు పెట్టినందుకు న్యాయస్థానం తీసుకున్నా నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు సమర్థిస్తున్నారు. ఇలాంటి వారికి శిక్ష వేసి న్యాయస్థానం మంచి చేసిందని మృతురాలి కుటుంబీకులు చెబుతున్నారు.
Ap Cyclone Sitrang Updates Live: ఏపీకి తుఫాన్ ముప్పు