Nalgonda farmers: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొందరు మిల్లర్ల యజమానులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో గిట్టుబాటు ధర పేరుతో కొందరు మిల్లర్ల యజమానులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. వరిసాగుతో రైతులు పంటలు వేయాల్సి వస్తోంది. ఈ విషయమై అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించినా మిల్లర్ల యాజమాన్యాలు ఆందోళనలు విరమించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు చెబుతున్న మాటలను పక్కన పెడితే మిల్లర్ల యజమానులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
Read also: PM Modi: హిందూ ఆలయాలపై దాడులు.. ఆస్ట్రేలియా ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం సమీపంలో ఉన్న రైస్ మిల్లు యజమానుల చేతివాటం చూపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లు దగ్గర.. IKP, PACS నుంచి వచ్చిన ధాన్యంలో.. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ-భువనగిరి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగ కుండా చూడలని ఉంటుంటే రైస్ మిల్లర్ల యజమానులు మాత్రం తరుగు పేరుతో ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. ఒకవైపు వర్షం, మరో వైపు నష్టపోయిన పంటలతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కొనేందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తుయని చెబుతున్న మిల్లర్ల యజమానులు మాత్రం రైతుల బతుకులతో ఆట్లాడుతుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైస్ మిల్లర్ల ఆగడాలని స్వస్థి చెప్పాలని కోరుతున్నారు. తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Bhatti Vikramarka: జడ్చర్ల నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర.. ఉద్దండపూర్ ప్రాజెక్టు పరిశీలన