సింగరేణిలో మూడు రోజుల సమ్మె ముగిసింది.భూగర్భ గనులతోపాటు ఓపెన్ కాస్టుల్లో పనిచేసే కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.మంచిర్యాల ,కొమురం భీం జిల్లాల్లోని బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్ ఏరియల్లో సమ్మె కారణంగా గనులు బోసిపోయాయి. 72 గంటలపాటు సాగిన సమ్మెలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం, జాతీయ కార్మిక సంఘాలు AITUC, INTUC, HMS, BMS, CITU లు సమ్మెలో పాల్గొన్నాయి.
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు 12 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ తో సమ్మె సాగింది…బెల్లంపల్లి రీజియన్ లలో 11 భూగర్బ గనులు, 5 ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తికి నిలిచిపోయింది..ఈ రీజియన్లో మూడు రోజుల్లో 62 కోట్ల నష్టం వాటిల్లగా, సింగరేణి వ్యాప్తంగా మొత్తం రోజు 1.5 లక్షల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోగా మూడు రోజుల్లో నాలుగున్నర లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, మొత్తం 120 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సింగరేణి సంస్థ ప్రకటనలో తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి సంస్థ కొత్తగా బొగ్గు బ్లాక్ ల ఏర్పాట్లుకు సన్నాహాలు చేస్తుంది.తెలంగాణ వ్యాప్తంగా సింగరేణిలో నాలుగు బ్లాక్ ల ప్రైవేటీకరణ చేయనుంది. అయితే ఈ బ్లాక్ ల సర్వే కోసం సింగరేణి అరవై కోట్లు ఖర్చు చేసింది. దీనికితోడు ఇతర రాష్ర్టాల్లో కూడా బొగ్గు బ్లాక్ లను తవ్వడానికి సింగరేణి ప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పుడు ఉన్న బ్లాకు లనే ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని సింగరేణిలో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థను కాపాడుకోవడం కోసం, మనుగడ కోసమే అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఒక్క భద్రాద్రి జిల్లాలోనే సింగరేణి సంస్థలకు వంద కోట్ల కు పైగా బొగ్గు ఉత్పత్తి పై ప్రభావం పడింది.
జిల్లాలోని ఇల్లెందు, మణుగూర్, కొత్తగూడెం ఏరియాలలోని అన్ని ఓపెన్ కాస్టులు, అండర్ గ్రౌండ్ గనులు మూత పడ్డాయి. కార్మికులు ఎవ్వరు విధులకు హాజరుకాలేదు. మణుగూరులో పూర్తి స్థాయిలో కార్మికులు.. సమ్మెలో పాల్గొనటం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి. దీంతో మూడ్రోజుల్లో సుమారు 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం జరిగింది. సింగరేణి కార్మికులకు సమ్మెకు మద్దతుగా భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ గని వద్ద TBGKS సంఘం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు భూపాలపల్లిలోని వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు..భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటి వరకు భూపాలపల్లి డివిజన్ పరిధిలో 21 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిపోగా,సింగరేణి సంస్థ కు సుమారు 51 కోట్ల నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు తెలిపారు.
