NTV Telugu Site icon

Cheating Couple: సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ పేరుతో దంపతులు భారీ మోసం.. లబోదిబో మంటున్న బాధితులు

Cheating Couple

Cheating Couple

Cheating Couple: సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న దంపతుల కేసు పోలీసులకే సవాల్‌ గా మారింది. ఇంజనీరింగ్‌ మెడికల్‌ సీట్లు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు దోచుకున్నారు. నిరుద్యోగులే లక్ష్యంగా భారీ మోసాలకు పాల్పడ్డారు. కోట్లలో దండుకున్నారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ పేరు చెప్పడంతో పాపం అమాయక ప్రజలు ఆదంపతులను నమ్మారు. సీటు సంపాదించుకోవచ్చని వారిదగ్గర ఉండేది ఆదంపతులకు ముట్టజెప్పారు. వారి శ్రమకు ఫలితం వస్తుందని ఆశపడ్డారు మోసపోయామని తెలియడంతో లబోదిబో అంటున్నారు. చివరకు పోలీస్టేషన్‌ మెట్లెక్కి న్యాయం చేయాలని వాపోతున్నారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ పేరు వినడంతో నమ్మాల్సి వచ్చిందని ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మాతో మాయమాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు కొట్టుని వారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆదంపతులకు ఇచ్చామని 50 లక్షల నుండి కోటి రూపాయలు వసూలు చేశారని బాధితులు తెలిపారు. ఈఘటన హైదరాబాద్‌ నడిబొడ్డున జరగడం తీవ్ర కలకలం రేపింది.

Read also: Indrakaran Reddy: నాందేడ్ గురుద్వార్ ను దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్‌ కాచిగూడలో దంపతులు సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించారు. వారి వద్దనుంచి దంపతులు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి ఇద్దరు కోట్ల రూపాయలు వసూలు చేశారు. మెడికల్ సీట్ కి 50 లక్షల నుండి కోటి రూపాయలు వసూలు చేశారు. ఇంజనీరింగ్ సీటుకి 10 లక్షల నుండి 16 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. గ్రోవెల్ ఎడ్యుకేషనల్ కెరియర్ సర్వీసెస్ పేరుతో శ్రీధర్ రెడ్డి కాచిగూడలో సంస్థలు ఏర్పాటు చేశాడు. గత రెండున్నరేళ్లుగా శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి ఇద్దరు మోసాలకు పాల్పడుతున్నారు. ఐదు నెలలుగా ఇంకా ఏమి స్పందన రాకపోవడంతో బాధితులు వారిని నిలదీశారు అయినా స్పందించలేదు ఇద్దరు దంపతులు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని న్యాయం చేస్తామని తెలిపారు కానీ.. ఇప్పటివరకు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి లను పోలీసులు పట్టుకోలేదని మండిపడుతున్నారు.

Read also: BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

శ్రీధర్ రెడ్డి పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మూడు ఎఫ్ఐఆర్ లు ఉండటం గమనార్హం. అయినా పోలీసులు ఇప్పటి వరకు వారిని ఎందుకు పట్టుకోలేక పోతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతమందితో వీరిద్దరు డబ్బులు కాజేశారో ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారో తేల్చాలని ఆ దంపతులిద్దరికి తగిన బుద్ధి చెప్పాలని, వారి డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత పోలీసులదే అని బాధితులు అంటున్నారు. ఇంత జరగుతున్నా వారిద్దరిని పోలీసులు ఎందుకు అదుపులో తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వేచిచూడాలి? అయితే వారిద్దరు ఎక్కడ వున్నారు? ఇప్పటికీ పోలీసులు దంపతులిద్దరిని ఎందుకు అదుపులో తీసుకోవడంలేదు? అనే విషయం పై బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ