Cheating Couple: సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో దంపతులు భారీ మోసం.. లబోదిబో మంటున్న బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheating Couple: సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న దంపతుల కేసు పోలీసులకే సవాల్ గా మారింది. ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు దోచుకున్నారు. నిరుద్యోగులే లక్ష్యంగా భారీ మోసాలకు పాల్పడ్డారు. కోట్లలో దండుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరు చెప్పడంతో పాపం అమాయక ప్రజలు ఆదంపతులను నమ్మారు. సీటు సంపాదించుకోవచ్చని వారిదగ్గర ఉండేది ఆదంపతులకు ముట్టజెప్పారు. వారి శ్రమకు ఫలితం వస్తుందని ఆశపడ్డారు మోసపోయామని తెలియడంతో లబోదిబో అంటున్నారు. చివరకు పోలీస్టేషన్ మెట్లెక్కి న్యాయం చేయాలని వాపోతున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరు వినడంతో నమ్మాల్సి వచ్చిందని ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మాతో మాయమాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు కొట్టుని వారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆదంపతులకు ఇచ్చామని 50 లక్షల నుండి కోటి రూపాయలు వసూలు చేశారని బాధితులు తెలిపారు. ఈఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరగడం తీవ్ర కలకలం రేపింది.
Read also: Indrakaran Reddy: నాందేడ్ గురుద్వార్ ను దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
హైదరాబాద్ కాచిగూడలో దంపతులు సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఇంజనీరింగ్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజలను నమ్మించారు. వారి వద్దనుంచి దంపతులు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి ఇద్దరు కోట్ల రూపాయలు వసూలు చేశారు. మెడికల్ సీట్ కి 50 లక్షల నుండి కోటి రూపాయలు వసూలు చేశారు. ఇంజనీరింగ్ సీటుకి 10 లక్షల నుండి 16 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. గ్రోవెల్ ఎడ్యుకేషనల్ కెరియర్ సర్వీసెస్ పేరుతో శ్రీధర్ రెడ్డి కాచిగూడలో సంస్థలు ఏర్పాటు చేశాడు. గత రెండున్నరేళ్లుగా శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి ఇద్దరు మోసాలకు పాల్పడుతున్నారు. ఐదు నెలలుగా ఇంకా ఏమి స్పందన రాకపోవడంతో బాధితులు వారిని నిలదీశారు అయినా స్పందించలేదు ఇద్దరు దంపతులు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని న్యాయం చేస్తామని తెలిపారు కానీ.. ఇప్పటివరకు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి లను పోలీసులు పట్టుకోలేదని మండిపడుతున్నారు.
Read also: BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
శ్రీధర్ రెడ్డి పై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మూడు ఎఫ్ఐఆర్ లు ఉండటం గమనార్హం. అయినా పోలీసులు ఇప్పటి వరకు వారిని ఎందుకు పట్టుకోలేక పోతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతమందితో వీరిద్దరు డబ్బులు కాజేశారో ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారో తేల్చాలని ఆ దంపతులిద్దరికి తగిన బుద్ధి చెప్పాలని, వారి డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత పోలీసులదే అని బాధితులు అంటున్నారు. ఇంత జరగుతున్నా వారిద్దరిని పోలీసులు ఎందుకు అదుపులో తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వేచిచూడాలి? అయితే వారిద్దరు ఎక్కడ వున్నారు? ఇప్పటికీ పోలీసులు దంపతులిద్దరిని ఎందుకు అదుపులో తీసుకోవడంలేదు? అనే విషయం పై బాధితులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!