Viral poster: సెలవు తీసుకున్న డ్రైవర్.. పోస్టర్లు వేసిన యజమాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A shocking incident: ప్రతిరోజూ ఎన్నో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటు ఉంటాయి. కొంతమంది చేసే పనులు చాలా వింతగా అనిపిస్తుంటాయి. కొందరు ఎవరూ ఊహించని కొన్ని విచిత్రమైన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. వింత పనులు చేసి హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఇటీవల ఓ యజమాని చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? అని కొందరు చర్చించుకుంటున్నారు. ఏదైనా శుభ కార్యాలు, దిన కర్మలు జరిగినప్పుడు ఫ్లెక్సీలు వేస్తారు. ఇక ఏదైనా కార్యక్రమాలు, సభలు, సమావేశాలు జరిగినప్పుడు రోడ్లపై రాజకీయ నేతల ఫ్లెక్సీలు దర్శనమిస్తుంటాయి. రాజకీయ నేతల నిర్ణయాలకు వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు, ఫ్లెక్సీలు వేయడం ఇటీవల చూశాం. అయితే ఓ యజమాని ఓ వింత చర్యతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. సెలవు తీసుకున్న కారు డ్రైవర్ తిరిగి డ్యూటీకి రాకపోవడంతో పోస్టర్లు అంటించాడు. ఈ ఆసక్తికర ఘటన హైదరాబాద్‌లో జరగడంతో ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Read also: Shirdi: మే 1 నుంచి షిర్డీ బంద్.. సీఐఎస్ఎఫ్ భద్రతపై గ్రామస్తులు సీరియస్
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నళిని అనే మహిళ నివాసం ఉంటోంది. రామకృష్ణ అనే వ్యక్తి ఆమెకు డ్రైవర్‌గా కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇటీవల బంధువు స్వగ్రామంలో చనిపోవడంతో యజమానికి చెప్పి సెలవుపై ఇంటికి వెళ్లాడు. అయితే అది నచ్చని కారు యజమాని.. డ్రైవర్ రామకృష్ణ మిస్సయ్యాడని పోస్టర్లు అంటిస్తున్నారు. పలు ఆటోల వెనుకాలతోపాటు డ్రైవర్ నివాసం ఉండే రహమత్ నగర్, డ్రైవర్ పిల్లలు చదువుకునే పాఠశాల పరిసరాల్లో పోస్టర్లు అతికించారు. యజమాని అల్లుడు ప్రకాష్ ఈ పోస్టర్లను అతికించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లపై డ్రైవర్ నంబర్‌తో పాటు అతని భార్య ఫోన్ నంబర్లను కూడా ముద్రించారు. ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారడంతో పాటు డ్రైవర్, అతని భార్య దృష్టికి వెళ్లింది. ఇది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఇదేం పని అంటూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్, అతని భార్య వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యజమాని నళినితో పాటు అల్లుడు ప్రకాశ్ వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో తన కాలు విరిగిందని, డ్యూటీకి తీసుకెళ్లేందుకు మనుషులను పంపి ఇంట్లోనే ఉండేలా ఒత్తిడి చేశారని బాధితుడు చెబుతున్నాడు.
Tspsc paper leak: ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. విచారణ జూన్ 5కి వాయిదా
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!