NTV Telugu Site icon

Viral poster: సెలవు తీసుకున్న డ్రైవర్‌.. పోస్టర్లు వేసిన యజమాని

Car Driver

Car Driver

A shocking incident: ప్రతిరోజూ ఎన్నో విచిత్రమైన పరిణామాలు చోటుచేసుకుంటు ఉంటాయి. కొంతమంది చేసే పనులు చాలా వింతగా అనిపిస్తుంటాయి. కొందరు ఎవరూ ఊహించని కొన్ని విచిత్రమైన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. వింత పనులు చేసి హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఇటీవల ఓ యజమాని చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? అని కొందరు చర్చించుకుంటున్నారు. ఏదైనా శుభ కార్యాలు, దిన కర్మలు జరిగినప్పుడు ఫ్లెక్సీలు వేస్తారు. ఇక ఏదైనా కార్యక్రమాలు, సభలు, సమావేశాలు జరిగినప్పుడు రోడ్లపై రాజకీయ నేతల ఫ్లెక్సీలు దర్శనమిస్తుంటాయి. రాజకీయ నేతల నిర్ణయాలకు వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు, ఫ్లెక్సీలు వేయడం ఇటీవల చూశాం. అయితే ఓ యజమాని ఓ వింత చర్యతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. సెలవు తీసుకున్న కారు డ్రైవర్ తిరిగి డ్యూటీకి రాకపోవడంతో పోస్టర్లు అంటించాడు. ఈ ఆసక్తికర ఘటన హైదరాబాద్‌లో జరగడంతో ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Read also: Shirdi: మే 1 నుంచి షిర్డీ బంద్.. సీఐఎస్ఎఫ్ భద్రతపై గ్రామస్తులు సీరియస్‌

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నళిని అనే మహిళ నివాసం ఉంటోంది. రామకృష్ణ అనే వ్యక్తి ఆమెకు డ్రైవర్‌గా కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఇటీవల బంధువు స్వగ్రామంలో చనిపోవడంతో యజమానికి చెప్పి సెలవుపై ఇంటికి వెళ్లాడు. అయితే అది నచ్చని కారు యజమాని.. డ్రైవర్ రామకృష్ణ మిస్సయ్యాడని పోస్టర్లు అంటిస్తున్నారు. పలు ఆటోల వెనుకాలతోపాటు డ్రైవర్ నివాసం ఉండే రహమత్ నగర్, డ్రైవర్ పిల్లలు చదువుకునే పాఠశాల పరిసరాల్లో పోస్టర్లు అతికించారు. యజమాని అల్లుడు ప్రకాష్ ఈ పోస్టర్లను అతికించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లపై డ్రైవర్ నంబర్‌తో పాటు అతని భార్య ఫోన్ నంబర్లను కూడా ముద్రించారు. ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారడంతో పాటు డ్రైవర్, అతని భార్య దృష్టికి వెళ్లింది. ఇది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఇదేం పని అంటూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డ్రైవర్, అతని భార్య వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యజమాని నళినితో పాటు అల్లుడు ప్రకాశ్ వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో తన కాలు విరిగిందని, డ్యూటీకి తీసుకెళ్లేందుకు మనుషులను పంపి ఇంట్లోనే ఉండేలా ఒత్తిడి చేశారని బాధితుడు చెబుతున్నాడు.
Tspsc paper leak: ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. విచారణ జూన్ 5కి వాయిదా