సినిమా వాళ్ల కోసం చిరంజీవి వస్తే రాజకీయాలు చేస్తారా..? మంత్రి బాలినేని

సీఎం జగన్‌ను చిరంజీవి కలిసింది కేవలం సినీ పరిశ్రమపై చర్చించటం కోసమేనని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈ విషయాన్ని కూడా ఎందుకు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారో అర్థం అవ్వడం లేదన్నారు. అలా ఎందుకు చేస్తారో కూడా తెలియడం లేదని మంత్రి మండిపడ్డారు. కేవలం సినిమా వాళ్ల కోసమే చిరంజీవి వస్తే ఏదో ఒక రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. సీఎం జగన్ అన్నదమ్ములను విడదీసి రాజకీయం చేయాలనే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: రవితేజ “కిలాడి” నుంచి సంక్రాంతి పోస్టర్‌

పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్‌ ఒంటరిగానే పోటీ చేస్తున్నారన్నారు. చంద్రబాబు దళితులు, కాపుల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని మంత్రి బాలినేని విమర్శించారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు..కానీ ఎవరికి ఏమి చేయడు అంటూ చంద్రబాబు పై ఫైర్‌ అయ్యారు మంత్రి బాలినేని. చిరంజీవి పెద్ద స్టార్ కాబట్టి వారి తరపున వచ్చి సీఎం జగన్‌తో సినిమా వాళ్ల బాగోగుల కోసం వచ్చారే తప్ప ఏ రాజకీయ ఉద్దేశం లేదని మంత్రి తెలిపారు. సీఎం జగన్‌ సినిమా వాళ్ల కోసం చేయగలిగినంత చేస్తారన్నారని మంత్రి తెలిపారు.

Related Articles

Latest Articles