నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలో నేటి నుంచి బోనాల పండుగ ప్రారంభం కానుంది. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం, ఆలయకమిటీలు సన్నద్ధమయ్యాయి. మరోవైపు..బోనాల సందర్బంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ప్రార్థించారు.ఆషాడమాసం బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలు కానుంది. ఇవాళ్టి నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
read also : అంతరిక్షంలో తెలుగమ్మాయి.. ప్రయాణం ఈరోజే
Also Read
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్‌కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
జూలై 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలు, ఆగస్టు 1,2 తేదీల్లో ఓల్డ్‌సిటీ లాల్ దర్వాజా మహంకాళీ అమ్మవారి బోనాలు జరగనున్నాయి.. ఆగస్ట్ 8న గోల్కొండలోనే ఉత్సవాలు ముగియనున్నాయి. ఇప్పటికే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం 15కోట్ల రూపాయలు విడుదల చేసింది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
బోనాల పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ .. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాలు… తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని అభివర్ణించారు. అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో, తెలంగాణ రాష్ట్రం… దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆయన ప్రార్థించారు.
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?