ఓ గవర్నమెంట్ హాస్పిటల్ లో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ తల్లి బిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరైంది. ప్రసవం కోసం వచ్చి కడుపులోనే బిడ్డను కోల్పోడంతో ఆతల్లి తల్లడింది. ఈఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
విజయ కుమారికి అనే గర్భవతికి ప్రసవం కోసం ఈనెల 4న డేట్ ఇచ్చారు డాక్టర్లు. హాస్పటల్ లో ప్రసవం కోసం నాలుగు రోజుల క్రితం విజయ కుమారి అడ్మిట్ అయ్యింది. నార్మల్ డెలివరీ చేయాలనే పేరుతో నిన్నటి వరకు డాక్టర్లు ప్రసవం చేయలేదు. నార్మల్ డిలివరి కోసం గత నాలుగు రోజులుగా పేషెంట్ కు సిబ్బంది మందులు ఇస్తూవచ్చారు.
మందులు వేసుకున్నాక మహిళకు తీవ్రమైన రక్తస్రావం అవడంతో.. ఆమె నరకయాతన అనుభవించింది. సిబ్బందికి తెలుపడంతో.. హుటాహుటిన సిబ్బంది అర్థరాత్రి విజయకుమారిని ఆపరేషన్ ధియేటర్ తరలించారు. కడుపులోని శిశువును బయటకు తీశారు. కానీ శిశువు అప్పటికే మృతిచెందింది. కడుపులోనే శిశువు మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు. దీంతో విజయకుమారి తల్లిడిల్లింది. డాక్టర్లు నిర్లక్ష్యమే నాబిడ్డను బలితీసుకుందని వాపోయింది. ప్రభుత్వ అవార్డుల కోసం తమ బిడ్డను బలిచేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితలు డిమాండ్ చేశారు.
కాగా.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3000 పారితోషకం అందజేస్తామని హరీష్ రావు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని, ప్రజారోగ్యం కోసం మార్పు తెవాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో సిజేరియన్లను ప్రోత్సహించకూడదని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని ఆయన అన్నారు. తెలంగాణలోని అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగా పెరగాలి.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తేడా ఏమిటో ప్రజలకు తెలియాలి. ఇటీవల కాలంలో సిజేరియన్లు భారీగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో సిజేరియన్లను ప్రోత్సహించకూడదని. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని. రాష్ట్రవ్యాప్తంగా నార్మల్ డెలివరీలు చేయించేవారికి రూ. 3000 పారితోషకాన్ని అందజేస్తాం.” అని హరీశ్ ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో వైద్యులు పారితోషకం కోసమే శిశువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
Jubilee Hills Pub Gang Case: ఫిర్యాదు ఇచ్చారని తెలియగానే అందరం ఎస్కేప్