NTV Telugu Site icon

TGSRTC: ఆర్టీసీలో 3035 కొలువులు.. ఉద్యోగార్థులకు ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్

Sajjanar Tgsrtc

Sajjanar Tgsrtc

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్‌లైన్‌లో వస్తున్న లింకులను నమ్మవద్దని ఆయన కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు.

Read Also: Adilabad: రేపు ఉట్నూర్‌కు కేబినెట్ సబ్‌ కమిటీ.. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ

ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక అంటూ ఆయన అప్‌డేట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును టీజీఎస్‌ఆర్టీసీ ప్రారంభించిందని సజ్జనార్‌ పేర్కొన్నారు. “3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింక్‌లను ఉద్యోగార్థులు నమ్మొద్దు. క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయొద్దని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.” అని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అలర్ట్ ఇచ్చారు.

Show comments