Group2 Edit Option: గ్రూప్-2 అభ్యర్థులు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్..
- కొనసాగుతున్న గ్రూప్ 1-2-3 మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ..
- దరఖాస్తులో నమోదు చేసిన వివరాలలో తప్పులను సరిదిద్దడానికి ఎడిట్ ఆప్షన్..
- గ్రూప్-2 విద్యార్థులకు ఈ అవకాశం ఈరోజు సాయంత్రం వరకే ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group2 Edit Option: తెలంగాణ జాబ్ జాతర కొనసాగుతుంది. ఓ వైపు గ్రూప్ 4 పోస్టుల అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. ఇక మరోవైపు గ్రూప్ 1,2,3 మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29, 2022న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 783 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ క్రమంలో గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ భారీ అలర్ట్ ఇచ్చింది. దరఖాస్తులో నమోదు చేసిన వివరాలలో తప్పులను సరిదిద్దడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడింది. ఈ అవకాశం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో అధికారులు గ్రూప్-2 విద్యార్థులకు ఈరోజు సాయంత్రం వరకే ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. మళ్లీ ఈ అవకాశం కోసం లింక్ ఓపెన్ చేసిన ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.
Read also: Bike Thieves: పార్క్ చేసిన వాహనాలే టార్గెట్.. సీసీ కెమెరాలో దృశ్యాలు
Also Read
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
గ్రూప్ 2 పరీక్షలు గతేడాది పూర్తి కావాల్సి ఉంది. కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024, ఆగస్టు 7 మరియు 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగార్థులు పుస్తకాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నమోదు చేసిన వివరాల్లో తప్పుల సవరణకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ జూన్ 16న ప్రారంభమైంది. ఈరోజు అంటే జూన్ 20 సాయంత్రం 5 గంటలకు గడువు ముగుస్తుంది. అంటే గ్రూప్ 2 అభ్యర్థులు తమ దరఖాస్తును సవరించేందుకు మరో కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇంకా తమ వివరాలను సరిదిద్దుకోని వారు వెంటనే సరిచేయాలి. లేదంటే టీజీపీఎస్సీ సవరణకు మరో అవకాశం ఉండదని వెల్లడించింది. ఇప్పటివరకు ఎడిట్ చేయని వారు నేటి ముగింపు సమయానికి ముందే వివరాలను సరిచేయాలని కమిషన్ కోరింది. ఆ తర్వాత పొరపాట్లు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎడిటింగ్ పూర్తయిన తర్వాత పిడిఎఫ్ ఫార్మాట్‌లో అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
JBL Live Beam 3 Price: జేబీఎల్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. 48 గంటల ప్లేబ్యాక్ టైమ్!
తాజావార్తలు
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!