Site icon NTV Telugu

TG To Replace TS: ఇకపై టీఎస్ స్థానంలో టీజీ.. నేటి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం..!

Ts To Tg

Ts To Tg

TG To Replace TS: తెలంగాణలో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై ‘టీఎస్’ బదులు ‘టీజీ’ కనిపించనుంది. కొత్తగా రిజిస్టరైన వాహనాలన్నీ ‘టీజీ’ పేరుతో రిజిస్టర్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలైంది. ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ని పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు జరగనున్న కేబినెట్ భేటీ తర్వాత దీనికి సంబంధించి కీలక నిర్ణయం వెలువడుతుందని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటిపైనా ‘టీఎస్’ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రం ఆవిర్భవించకముందే కొత్తగా వచ్చిన దానిలో ‘టీజీ’ అనే అక్షరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘టీఎస్‌’ అనే అక్షరాలను ‘తెలంగాణ రాష్ట్రం’ అని అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలియజేసేందుకు అనధికారికంగా తమ వాహనాలకు ‘టీజీ’ నంబర్ ప్లేట్లను పెట్టుకున్నారు.

Read also: Nirmal Handicrafts: ఆదరణ కోల్పోతున్న నిర్మల్ కొయ్య బొమ్మలు..కళాకారుల ఆవేదన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను క్లుప్తంగా ‘ఏపీ’ అని పిలిచేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆ పేరు కొనసాగింది. కానీ ఉద్యమ సమయంలో కూడా చాలా మంది తెలంగాణను ‘టీజీ’ అని సంబోధించేవారు. విడిపోయాక అదే పేరుతో పిలుస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ రాష్ట్రం పేరు చిన్నది కాబట్టి దీనిని ‘తెలంగాణ’ అని పిలుస్తారు. అయితే వాహనాలపై కూడా ‘టీజీ’ ఉంటుందని భావిస్తే.. అధికారికంగా ‘టీఎస్’గా మారిపోయింది. కానీ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తన మార్క్ చూపించాలనే ఉద్దేశంతో మళ్లీ ‘టీజీ’ పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగే కేబినెట్‌ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన మరో రెండు హామీల అమలుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ హామీలలో మహాలక్ష్మి హామీలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారెంటీ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటి అమలుకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.
CM Revanth Reddy With Chiranjeevi: చిరంజీవి విందులో సీఎం రేవంత్ రెడ్డి.. ఫోటోలు వైర‌ల్‌..!

Exit mobile version