Terrorist Attacks Plan in Hyderabad: హైదరాబాద్‌లో ఉగ్ర కుట్ర కేసులో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సిటీలో పేలుళ్లకు కుట్ర పనిన్న కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అబ్దుల్ జాహిద్‌తో పాటు సమీవుద్దీన్, మాజా హాసన్ అరెస్ట్ అయ్యారు. మొత్తం ఆరుచోట్ల పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్లతో బాంబు దాడులకు ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఆరు ప్రాంతాలను జాహిద్ గ్యాంగ్ రెక్కీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అటు జాహిద్ గ్యాంగ్ రిమాండ్ ఫార్మాలిటీస్‌ను దర్యాప్తు అధికారులు పూర్తి చేస్తున్నారు. సీజ్డ్ మెటీరియల్, ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్‌లను సిట్ అధికారులు సేకరిస్తున్నారు.
Read Also: Durga Puja: జాతిపితకు అసుర రూపం.. దుర్గా మండపంపై దుమారం
కాగా ఉగ్ర కుట్ర కేసులో అరెస్ట్ అయిన నిందితులను సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. గతంలో సిటీలో జరిగిన అన్ని బ్లాస్ట్ కేసుల్లో జాహిద్, అతడి అన్న బిలాల్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో సిటీలో బ్లాస్టుల అనంతరం జాహేద్ అన్న బిలాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే పాకిస్థాన్‌లోని ఓ గ్యాంగ్ వార్‌లో బిలాల్ మరణించాడని తెలిపారు. బిలాల్ నెట్‌వర్క్ నుండే పాక్ హ్యాండ్లర్లతో ప్రస్తుతం జాహిద్‌కు లింక్స్ ఏర్పడ్డాయని చెప్పారు. కొంతమంది హైదరాబాదీలు పాకిస్తాన్‌లో మకాం వేశారని.. అక్కడి నుంచి జాహిద్‌ను టెర్రరిస్టులు ఆపరేట్ చేస్తున్నట్లు సిట్ అధికారుల విచారణలో స్పష్టమైంది.