Bajrangdal protest: కర్ణాటకలో మొదలైన కాంగ్రెస్ మేనిఫెస్టో సెగ తెలంగాణను తాకింది. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామన్న కాంగ్రెస్ హామీపై కర్ణాటకలో బీజేపీ ఇప్పటికే వివాదంలో ఉంది. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో నినాదాలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణలోని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యాలయాల ఎదుట హనుమాన్ చాలీసా పఠించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా భజరంగ్ దళ్ శ్రేణులు రెచ్చిపోయాయి. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక ఎన్నికల సందర్భంగా బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో వివాదం చెలరేగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బజరంగ్‌దళ్ శ్రేణులు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కూడా భజరంగ్ దళ్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు ప్రజాస్వామ్యయుతంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బజరంగ్ దళ్, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ గాంధీభవన్ కు చేరుకున్నారు.
Read also: Fake ice cream: మళ్లీ కల్తీ ఐస్ క్రీం కలకలం.. లైట్ తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం
గాంధీభవన్ ముందు నిలబడి హనుమాన్ చాలీసా పఠించేందుకు ప్రయత్నించారు. కానీ గాంధీభవన్‌కు చేరుకున్న భజరంగ్‌దళ్, బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, భజరంగ్ దళ్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై భజరంగ్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ శ్రేణులు గాంధీభవన్‌కు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో గాంధీభవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు గాంధీభవన్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భజరంగ్ దళ్ శ్రేణులు నిరసనలు తెలిపాయి. సిరిసిల్ల జిల్లాలో నిరసనకు సిద్ధమైన బీజేపీ, భజరంగదళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నుంచి పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
AC Helmet: తెలంగాణ సర్కార్ కూల్ వార్త.. త్వరలో ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్