Warangal: వరంగల్ సంరక్ష హాస్పిటల్ ముందు ఆందోళన ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. ఈనెల 11వ తేదీన కిడ్నీ సమస్యతో సంరక్ష హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చిన వాణికి ఆపరేషన్ చేపిస్తే సరిపోతుందని వైద్యులు చెప్పారు. దీంతో.. రోగికి ఆపరేషన్ చేయించారు కుటుంబసభ్యులు. అయితే.. ఆపరేషన్ వికటించి రోగి పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలని సంరక్ష యాజమాన్యం చేతులెత్తేశారు. దీంతో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. అయితే యశోద ఆసుపత్రిలో అయ్యే ఖర్చు మొత్తం సంరక్ష యాజమాన్యం రోగి బంధువులకు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. వెంటనే రోగిని హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రిలో ఐదు రోజులు వైద్యం అందించిన డాక్టర్లు సంరక్ష యాజమాన్యం డబ్బులు కట్టడం లేదని నిన్న రాత్రి వైద్యం ఆపడంతో రోగి మృతి చెందింది. వాణి మృతి చెందడంతో.. మృతదేహాన్ని సంరక్ష హాస్పిటల్ కి తరలించి హాస్పిటల్ లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Read also: Warangal: కుళ్లిన మాంసాన్ని మసాలాతో కవర్ చేస్తున్నారు.. తినే ముందు జర జాగ్రత్త
సంరక్ష హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రోగి పరిస్థితి విషమించడంతో వెంటనే యశోద ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకున్నారని మృతి చెందిన రోగి కూతురు వాపోయింది. వైద్యం అందించడం లేదని సంరక్ష యాజమాన్యానికి ఎన్నిమార్లు కాల్ చేసిన ఎవరు స్పందించలేదని కన్నీరుమున్నీరుగా విలపించింది. రోగిని తరలించే వరకు తమదే బాధ్యత అని లిఖితపూర్వకంగా పత్రం రాసిచ్చి కూడా తన తల్లి మృతికి కారణకులు అయ్యారని మండిపడింది. అందుకే సంరక్ష ఆసుపత్రిలోనే తన తల్లిని మృతదేహాన్ని దహన సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. అక్కడకు పోలీసులు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుల వద్ద పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Gold Price Today: శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే!