NTV Telugu Site icon

Summer Holidays: విద్యార్థులకు పండగే…. రేపటి నుంచి వేసవి సెలవులు..

Summer Holidyes Telangana

Summer Holidyes Telangana

Summer Holidays: తెలంగాణలో రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో.. వేసవి సెలవులను హాయిగా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈరోజు ఒక్కరోజు స్కూళ్లకు వెళితే.. రేపటి నుంచి 50 రోజుల పాటు ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వన్ డే స్కూల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే… తెలంగాణలో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభంకాగా నేటితో ముగియనున్నాయి.

Read also: AAP: హనుమంతుడి చేతిలో ఇన్సులిన్‌ పెట్టి శోభాయాత్ర.. ఆప్‌ తీరుపై నెటిజన్లు ఫైర్

దీంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు రేపటి నుంచి (ఏప్రిల్ 24 నుంచి) జూన్ 11 వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు నిన్న అంటే సోమవారం జరగింది. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఆన్ లైన్ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. రేపటి నుంచి (ఏప్రిల్ 24 నుండి) జూన్ 11 వరకు విద్యార్థులకు దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఆ తర్వాత జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: Vijay Deverakonda: పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లి.. దేవరకొండ స్వీట్ సర్ప్రైజ్

ఇంటర్ కాలేజీల విషయానికొస్తే.. ఇంటర్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 30 నుంచి కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30 నుండి మే 31 వరకు ఉంటాయి. అంటే వారు సుమారు రెండు నెలల పాటు సెలవులను ఆనందిస్తారు. జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభమవుతాయి.

Read also: Mangos : మామిడి కాయలను ఇలానే ఎందుకు తినాలో తెలుసా?

ఏపీలో కూడా ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఇప్పటికే సెలవులు ప్రారంభమయ్యాయి. మే 31 వరకు ఇవి కొనసాగనున్నాయి.జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మే నెలకు ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జూన్ మూడో వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే.. పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉందని, అప్పటి పరిస్థితిని బట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
PM Modi: రిజర్వేషన్లు రద్దు, మతం ఆధారంగా విభజించడం జరగదు..